Bus Accident: బిడ్డ వైద్యానికి రూ.కోటి విరాళం అందినా.. ప్రమాదం రూపంలో కబలించిన మృత్యువు!

ఉన్నంతలో తృప్తిగా బతికే కలతలు లేని ఆ కాపురంలో విధి చిచ్చు పెట్టింది. రోజు కూలీ చేసుకుని పొట్టపోసుకునే ఆ దంపతులకు చిన్న కుమారుడి రూపంలో ఖరీదైన కష్టం వచ్చింది. కుమారుడికి ప్రాణాంతక వ్యాధి రావడంతో తల్లడిల్లిపోయారు. ఐతే దాతలు ముందుకొచ్చి కోటి రూపాయలు సాయం..

Bus Accident: బిడ్డ వైద్యానికి రూ.కోటి విరాళం అందినా.. ప్రమాదం రూపంలో కబలించిన మృత్యువు!
Karnataka Bus Accident
Follow us

|

Updated on: Oct 04, 2022 | 8:33 PM

ఉన్నంతలో తృప్తిగా బతికే కలతలు లేని ఆ కాపురంలో విధి చిచ్చు పెట్టింది. రోజు కూలీ చేసుకుని పొట్టపోసుకునే ఆ దంపతులకు చిన్న కుమారుడి రూపంలో ఖరీదైన కష్టం వచ్చింది. కుమారుడికి ప్రాణాంతక వ్యాధి రావడంతో తల్లడిల్లిపోయారు. ఐతే దాతలు ముందుకొచ్చి కోటి రూపాయలు సాయం చేస్తామని చెప్పగానే.. బిడ్డను బతికించుకునే మార్గం దొరికిందని సంబరపడ్డారు. ఇంతలో ఊహించని ప్రమాదం జరిగింది. వివరాల్లోకెళ్తే..

తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్‌(45), సెల్వి(36) దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. బతుకు దెరువు కోసం కొన్నేళ్లుగా బెంగళూరులో ఉంటున్నారు. ఇంతలో వారి చిన్న కుమారుడికి (4) ప్రాణాంతక వ్యాధి వచ్చినట్లు తెలిసింది. చికిత్సకు బెంగళూరులోని ఓ విద్యా సంస్థ కోటి రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. దీంతో పెద్ద కుమారుడిని బెంగళూరు కత్రిగుప్పెలోని తాత వద్ద ఉంచి, సెప్టెంబర్ 30న తమిళనాడులోని స్వగ్రామానికి వచ్చారు. కొంత డబ్బును సమకూర్చుకున్నాక ఆదివారం రాత్రి 9 గంటల 30 నిముషాలకు బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. ఐతే అర్ధరాత్రి సమయంలో రోడ్డు పక్కన రాళ్ల లోడుతో నిలిపి ఉంచిన లారీని వీరు ప్రయాణిస్తున్న బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాలమురుగన్‌, సెల్వి అక్కడికక్కడే మృతి చెందారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

వీరందరినీ బెంగళూరు మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో బాలమురుగన్‌ చిన్న కుమారుడు కూడా ఉన్నాడు. అసలే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. నిర్లక్ష్యం బస్సును నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్‌ 3 (సోమవారం)న మృతదేహాలను స్వగ్రామమైన కళ్లిపట్టుకు చేర్చారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Latest Articles