ESIC Jobs 2022: ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన 17 సీనియర్ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

ESIC Jobs 2022: ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో సీనియర్‌ రెసిడెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..
ESIC New Delhi
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 05, 2022 | 3:39 PM

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన 17 సీనియర్ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనెస్థీషియా, మెడిసిన్‌, చెస్ట్‌, సర్జరీ, క్యాజువాలిటీ, స్కిన్, ఆర్థోపెడిక్స్‌, మైక్రోబయాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/బీఎన్‌బీ/డిప్లొమా లేదా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు అక్టోబర్‌ 6, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. అక్టోబర్‌ 6వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత సాధించినవారికి నెలకు రూ.1,30,797ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.