HAL Jobs 2022: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సెక్యురిటీ గార్డు ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. తాత్కాలిక ప్రాతిపదికన 25 సెక్యురిటీ గార్డు (ఎక్స్ సర్వీస్‌మెన్‌), ఫిట్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..c

HAL Jobs 2022: బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సెక్యురిటీ గార్డు ఉద్యోగాలు.. ఈ అర్హతలు తప్పనిసరి..
HAL Bengaluru
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 05, 2022 | 3:24 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. తాత్కాలిక ప్రాతిపదికన 25 సెక్యురిటీ గార్డు (ఎక్స్ సర్వీస్‌మెన్‌), ఫిట్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పీయూసీ, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌, ఎస్ఎస్ఎల్‌సీ, ఐటీఐ లేదా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే సెప్టెంబర్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 28 యేళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులకు వయోపరిమితి విషయంలో రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 24, 2022వ తేదీ రాత్ర 11 గంటల 59 నిముషాలలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.43,772ల నుంచి రూ.45,780ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.