BRO Jobs 2022: టెన్త్/ఇంటర్‌ అర్హతతో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 246 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌.. 246 డ్రాఫ్ట్‌మెన్‌, సూపర్‌వైజర్‌, హిందీ టైపిస్ట్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తూ తాజాగా..

BRO Jobs 2022: టెన్త్/ఇంటర్‌ అర్హతతో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో 246 ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Border Roads Organization
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 05, 2022 | 4:36 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌.. 246 డ్రాఫ్ట్‌మెన్‌, సూపర్‌వైజర్‌, హిందీ టైపిస్ట్‌ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఐతే ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగిస్తూ తాజాగా ప్రకటన ఇచ్చింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు నవంబర్‌ 10వ తేదీ వరకు దరఖాస్తులు పంపించడానికి అవకాశం కల్పించింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఎవరైనా ముగింపు తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు దరఖాస్తు రుసుముగా రూ.50 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.18,000ల నుంచి రూ.92,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. షార్ట్ నోటిఫికేషన్‌ ఆగస్టు 11, 2022న విడుదలైంది.

ఖాళీల వివరాలు:

  • డ్రాఫ్ట్ మ్యాన్ పోస్టులు: 14
  • సూపర్‌వైజర్ పోస్టులు: 7
  • సూపర్‌వైజర్ సైఫర్ పోస్టులు: 13
  • సూపర్‌వైజర్ దుకాణాలు పోస్టులు: 9
  • హిందీ టైపిస్ట్ పోస్టులు: 10
  • ఆపరేటర్ (కమ్యూనికేషన్) పోస్టులు: 35
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 30
  • వెల్డర్ పోస్టులు: 24
  • మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు: 22
  • మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు: 82

అడ్రస్‌: Commandant, GREF CENTRE, Dighi Camp, Pune – 411 015.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.