AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Same Gotra Marriage: దంపతులిద్దరిదీ ఒకే గోత్రమని.. అన్నాచెల్లెలు అవుతారంటూ జంటను విడదీసిన పంచాయితీ పెద్దలు

కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించి, పెళ్లిచేసుకున్నారు. తమ వైవాహిక జీవితం పండాలని కలలు కన్నారు. కానీ అనుకోని రీతిలో గ్రామ పెద్దల తీర్పు వీరిని వేరు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

Same Gotra Marriage: దంపతులిద్దరిదీ ఒకే గోత్రమని.. అన్నాచెల్లెలు అవుతారంటూ జంటను విడదీసిన పంచాయితీ పెద్దలు
Same 'gotra' Marriage
Srilakshmi C
|

Updated on: Oct 05, 2022 | 7:03 PM

Share

కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒకరినొకరు ప్రేమించి, పెళ్లిచేసుకున్నారు. తమ వైవాహిక జీవితం పండాలని కలలు కన్నారు. కానీ అనుకోని రీతిలో గ్రామ పెద్దల తీర్పు వీరిని వేరు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ జిల్లాకు చెందిన ఓ కాలేజ్‌లో చదువుకుంటున్న శివమ్‌ అనే యువకుడు, అదే కాలేజీలో చదివే తనూ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అనతికాలంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో.. పెద్దలకు తెలియకుండా దేవాలయంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సెప్టెంబర్‌ 12 సర్ధానా తహసీల్‌లో నమోదు చేయడంతో వీరి రహస్య వివాహం బయటికి పొక్కింది. ఐతే ఈ దంపతులిద్దరి గోత్రం ఒకటేనని, వరుసకు అన్నచెల్లెల్లు అవుతారని గ్రామపెద్దలు వీరి వివాహం విషయమై అభ్యంతరం వ్యక్తం చేశారు. గోత్రం ప్రకారం వరుసకు అన్నాచెల్లెలు అయ్యే వాళ్లకు వివాహం జరిపిస్తే గ్రామానికి మంచిది కాదని ఊరి పెద్దలు అన్నారు. ఇలాంటి వివాహం జరిపిస్తే ఊరికి అరిష్టమని, 5 రోజుల్లో యువతిని వారి తల్లిదండ్రులకు అప్పగించాలని, లేదంటే ఊరి నుంచిబహిష్కరిరస్తామని గ్రామ పంచాయితీ పెద్దలు తీర్పు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆదివారం జరిగిన ఈ పంచాయితీలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్‌తో సహా పలు గ్రామాలకు చెందిన ఠాకూర్ కమ్యూనిటీ ప్రజలు పాల్గొని ఈ మేరకు తీర్పునిచ్చారు. ఒక పెద్దమనిషి మాట్లాడుతూ.. ‘సామాజిక కట్టుబాట్లను విచ్ఛిన్నం చేసే ఈ విధమైన వివాహ బంధాన్ని మేము అంగీకరించం. ఇది సంప్రదాయానికి విరుద్ధం. వరుసకు అన్నాచెల్లెల్లయ్యే వీరి వివాహాన్ని అంగీకరిస్తే మరి కొందరు ఇలాగే చేసే అవకాశం ఉందని అన్నాడు. గ్రామ పెద్దలిచ్చిన తీర్పుకు భయభ్రాంతులకు గురైన దంపతులు తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దంపతుల పక్షాన హామీ ఇచ్చారు.