విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపే 25 బెస్ట్ మోటివేషనల్ కోట్స్.. జీవితంలో సక్సెస్ కావాలంటే ఇవి చదవాల్సిందే!
సాధారణంగా విద్యార్థి దశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన ఘట్టం. ఆ సమయంలో నేర్చుకునే విషయాలు, అలవర్చుకునే క్రమశిక్షణ, ఎదుర్కొనే అనుభవాలే భవిష్యత్తుకు పునాది వేస్తాయి అనడంలో సందేహం అక్కర్లేదు. కొత్త విషయాలు నేర్చుకోవడం, తప్పుల నుంచి పాఠాలు గ్రహించడం, లక్ష్యం వైపు నిరంతరం ప్రయత్నించడం నిజమైన విద్యార్థి లక్షణాలు. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే 25 ఉత్తమ మోటివేషనల్ కోట్స్..

సాధారణంగా విద్యార్థి దశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమైన ఘట్టం. ఆ సమయంలో నేర్చుకునే విషయాలు, అలవర్చుకునే క్రమశిక్షణ, ఎదుర్కొనే అనుభవాలే భవిష్యత్తుకు పునాది వేస్తాయి అనడంలో సందేహం అక్కర్లేదు. మరి ముఖ్యంగా చదువుతో పాటు సమయపాలన, పట్టుదల, ఆత్మవిశ్వాసం సహా మంచి ఆలోచనా విధానానికి ఇదే తొలిమెట్టుగా చెప్పొచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవడం, తప్పుల నుంచి పాఠాలు గ్రహించడం, లక్ష్యం వైపు నిరంతరం ప్రయత్నించడం నిజమైన విద్యార్థి లక్షణాలు. అందుకే విద్యార్థి జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని అంటుంటారు.
ఈ దశలోనే చదువులు, పరీక్షలు, అసైన్‌మెంట్లు, భవిష్యత్తుపై ఆందోళనలు.. ఇలా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో నిరాశకు లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం ఎంతో ముఖ్యం. సరైన ఆలోచనా విధానం, పట్టుదల, సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. అంతే కాకుండా పరీక్షల్లో వచ్చే మార్కులే ప్రతిభకు కొలమానం కాదని గ్రహించాలి. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా వాటిని విజయానికి మెట్లుగా భావించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ తమ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయాలి. ఈ క్రమంలోనే విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే 25 ఉత్తమ మోటివేషనల్ కోట్స్..
విద్యార్థుల కోసం బెస్ట్ 25 మోటివేషనల్ కోట్స్..
1. “విద్య ప్రపంచానికి తలుపులు తెరిచే తాళంచెవి.. స్వేచ్ఛను అందించే మార్గం.” – ఓప్రా విన్‌ఫ్రే
2. “ఎప్పుడైనా మీరు పడిపోయారా అన్నది ముఖ్యం కాదు.. పడిపోయిన ప్రతిసారీ మళ్లీ లేచి నిలబడుతున్నారా లేదా అన్నదే ముఖ్యం.” – విన్స్ లొంబార్డీ
3. “గడియారాన్ని చూస్తూ సమయాన్ని వృథా చేయకండి. అది ఎలా ముందుకు సాగుతుందో.. మీరు కూడా అలాగే సాగిపోండి.” – సామ్ లెవెన్సన్
4. “ఏదైనా సాధించాలంటే ముందుగా మాటలు తగ్గించి.. పని ప్రారంభించాలి.” – వాల్ట్ డిస్నీ
5. “మీపై మీకు నమ్మకం ఉంటే.. విజయంలో సగం దూరం చేరుకున్నట్లే.” – థియోడర్ రూజ్‌వెల్ట్
6. “ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య.” – నెల్సన్ మండేలా
7. “మీరు చేసే పనిని ప్రేమించినప్పుడే గొప్ప విజయాలు సాధించగలరు.” – స్టీవ్ జాబ్స్
8. “మీ ప్రయాణం నెమ్మదిగా సాగినా పర్వాలేదు.. కానీ ఎక్కడా ఆగిపోకండి.” – కన్ఫ్యూషియస్
9. “సాధారణ వ్యక్తులను అసాధారణ లక్ష్యాల కోసం సిద్ధం చేసేవే కష్టాలు.” – సి.ఎస్. లూయిస్
10. “అవకాశాల కోసం ఎదురుచూడకండి.. మీరే కొత్త అవకాశాలను సృష్టించుకోండి.” – క్రిస్ గ్రాసర్
11. “ఈ రోజు నిపుణుడిగా ఉన్న ప్రతి ఒక్కరూ.. ఏదో ఒక రోజు ప్రారంభకులే.” – హెలెన్ హేస్
12. “ఒక పని పూర్తయ్యే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుంది.” – నెల్సన్ మండేలా
13. “విజయం అంతిమ గమ్యం కాదు.. అపజయం అంతం కాదు. ముందుకు సాగేందుకు అవసరమైన ధైర్యమే అసలైన బలం.” – విన్‌స్టన్ చర్చిల్
14. “వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది.” – లావో త్జు
15. “ప్రతి కష్టంలోనూ ఒక అవకాశం దాగి ఉంటుంది.” – ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
16. “విజయం అనేది అప్పుడప్పుడు చేసే ప్రయత్నాలతో కాదు.. నిరంతర కృషితోనే సాధ్యమవుతుంది.” – మేరీ ఫోర్లియో
17. “మంచి అవకాశాన్ని వదులుకోవడానికి భయపడకండి.. అంతకంటే గొప్పదాన్ని సాధించడానికి సిద్ధంగా ఉండండి.” – జాన్ డి. రాక్‌ఫెల్లర్
18. “కష్టపడి సాధించిన విజయం ఇచ్చే ఆనందం మరేదీ ఇవ్వదు.” – అజ్ఞాతం
19. “కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకోవడానికి లేదా కొత్త కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు.” – సి.ఎస్. లూయిస్
20. “అవకాశం కోసం ఎదురుచూడకండి.. దాన్ని మీరే సృష్టించుకునే ప్రయత్నం చేయండి.” – విలియం బట్లర్ యేట్స్
21. “విలువైన గమ్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి అడ్డదారులూ ఉండవు.” – బెవర్లీ సిల్స్
22. “ఇష్టంతో నేర్చుకున్న విషయాలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.” – ఆల్ఫ్రెడ్ మెర్సియర్
23. “పెద్ద కలలు కనండి.. వాటిని సాధించే క్రమంలో ఎదురయ్యే అపజయాలకు భయపడకండి.” – నార్మన్ వాఘన్
24. “రేపటి విజయానికి అడ్డుగా నిలిచేది ఈ రోజు మనలో ఉండే సందేహాలే.” – ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్
25. “విజయం ఒక్కరోజులో రాదు.. ప్రతిరోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాల ఫలితమే విజయం.” – రాబర్ట్ కొల్లియర్
