ESIC Recruitment 2022: రూ.2 లక్షలకుపైగా జీతంతో ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. వివరాలివే..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన 18 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

ESIC Recruitment 2022: రూ.2 లక్షలకుపైగా జీతంతో ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. వివరాలివే..
ESIC Bangalore
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 06, 2022 | 2:55 PM

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరులోని ఎంప్లాయిస్ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. ఒప్పంద ప్రాతిపదికన 18 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రెస్పిరేటరీ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్‌, ఫార్మకాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, సైకియాట్రి, అనెస్థీషియాలజీ, రేడియో డయాగ్నోసిస్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/బీఎన్‌బీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 67 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు అక్టోబర్‌ 13, 14, 2022 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. అర్హత సాధించినవారికి కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

పోస్టుల వారీగా జీతాల వివరాలు..

ఇవి కూడా చదవండి
  • ప్రొఫెసర్‌ పోస్టులకు నెలకు రూ.2,28,942
  • అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,52,241
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,30,797

ఖాళీల వివరాలు..

  • ప్రొఫెసర్‌ పోస్టులు: 2
  • అసోసియేట్‌ ప్రొఫెసర్ పోస్టులు: 11
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు: 5

అడ్రస్: The office of Dean, ESIC Medical College PGIMSR & Model Hospital, Rajajinagar, Bangalore – 560 010

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.