IISER Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఐసర్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భోపాల్‌ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యుటేషన్‌/ఒప్పంద ప్రాతిపదికన 75 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

IISER Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఐసర్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
IISER Bhopal Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 06, 2022 | 3:23 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భోపాల్‌ లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐసర్).. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యుటేషన్‌/ఒప్పంద ప్రాతిపదికన 75 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/బీఈ/బీటెక్‌/ పీజీ/ఎంబీబీఎస్/ఎంసీఏ/బీఎస్సీ/పీహెచ్‌డీ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు 30 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్ 25, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 31, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. స్ర్కీనింగ్‌ టెస్ట్, స్కిల్ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఖాళీల వివరాలు..

  • లైబ్రేరియన్‌ పోస్టులు: 1
  • సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పోస్టులు: 1
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు: 1
  • ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్) పోస్టులు: 2
  • అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ పోస్టులు: 8
  • స్పోర్ట్స్ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • మెడికల్ ఆఫీసర్‌ పోస్టులు: 1
  • సీనియర్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు: 3
  • ఫిజికల్ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు: 1
  • సూపరింటెండెంట్‌ పోస్టులు: 5
  • జూనియర్‌ ఇంజనీర్‌ (సివిల్‌/ఎలక్ట్రికల్) పోస్టులు: 4
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ల్యాబ్) పోస్టులు: 2
  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఐటీ) పోస్టులు: 1
  • జూనియర్‌ లైబ్రరీ సూపరింటెండెంట్‌ పోస్టులు: 1
  • ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ల్యాబ్‌/ఐటీ) పోస్టులు: 9
  • జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులు:2
  • జూనియర్‌ అసిస్టెంట్‌ (ఎంఎస్) పోస్టులు: 14
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 6
  • అటెండెంట్‌ (ల్యాబ్‌/ఐటీ) పోస్టులు: 11

అడ్రస్: Recruitment Cell Room No 108, First Floor, Plasma Building Indian Institute of Science Education and Research Bhopal Bhopal By-Pass Road, Bhauri, Bhopal 462 066 Madhya Pradesh, India.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.