Coal India Limited: కోల్‌ ఇండియాలో నెలకు రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలివే..

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. 31 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

Coal India Limited: కోల్‌ ఇండియాలో నెలకు రూ.2 లక్షల జీతంతో ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలివే..
Coal India Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 06, 2022 | 5:44 PM

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పరిధిలోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. 31 మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సర్జన్‌, జనరల్‌ ఫిజిషియన్‌, ఆర్థోపెడిక్‌, డెర్మటాలజీ, రేడియాలజీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో సాధించిన మెరిట్‌ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.2,00,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • సీనియర్ మెడికల్ స్పెషలిస్టు (E4)/ మెడికల్ స్పెషలిస్టు (E3) పోస్టులు: 14
  • సీనియర్ మెడికల్ ఆఫీసర్ (E3) పోస్టులు: 17

అడ్రస్: Office of General Manager (personal/Recruitment), Recruitment department, NCL HQ, Singrauli (M.P)-486889.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.