SAIL Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? రేపటితో ముగుస్తున్న..
భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తులకు రేపే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని..
భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 200 ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? దరఖాస్తులకు రేపే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అక్టోబర్ 8వ తేదీ ముగింపు సమయంలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ/ఫార్మసీలో డిప్లొమా, బీఫార్మసీ, మేనేజ్‌మెంట్/హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంబీఏ/బీబీఏ/పీజీ డిప్లొమా/బీపీటీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.9,000ల నుంచి రూ.17,000ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. విభాగాల వారీగా ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి..
- మెడికల్ అటెండెంట్ ట్రైనింగ్ పోస్టులు: 100
- క్రిటికల్ కేర్ నర్సింగ్ ట్రైనింగ్ పోస్టులు: 20
- అడ్వాన్స్‌డ్ స్పెషలైజ్డ్ నర్సింగ్ ట్రైనింగ్ పోస్టులు: 40
- డేటా ఎంట్రీ ఆపరేటర్/ మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ ట్రైనింగ్ పోస్టులు: 6
- మెడికల్ ల్యాబ్. టెక్నీషియన్ ట్రైనింగ్ పోస్టులు: 10
- హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ పోస్టులు: 10
- ఓటీ/అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనింగ్ పోస్టులు: 5
- అడ్వాన్స్‌డ్ ఫిజియోథెరపీ ట్రైనింగ్ పోస్టులు: 3
- రేడియోగ్రాఫర్ ట్రైనింగ్ పోస్టులు: 3
- ఫార్మసిస్ట్ ట్రైనింగ్ పోస్టులు: 3
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.