Adipurush: ‘ఆదిపురుష్’ డ్యామెజ్ కంట్రోల్ పనిలో చిత్ర బృందం.. ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న వాస్తవాలు..
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మిథలాజిక్ మువీ 'ఆదిపురుష్'కి ఆరంభంలోనే గట్టి దెబ్బతగిలింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌లో డైరెక్టర్ ఓం రౌత్ సృజనాత్మత కారణంగా యావత్ చిత్ర బృందం తలలు పట్టుకుంటున్నారు..
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మిథలాజిక్ మువీ ‘ఆదిపురుష్’కి ఆరంభంలోనే గట్టి దెబ్బతగిలింది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌లో డైరెక్టర్ ఓం రౌత్ సృజనాత్మకత కారణంగా యావత్ చిత్ర బృందం తలలు పట్టుకుంటున్నారు. టీజర్‌లో కనిపించిన భారీ స్పెషల్ ఎఫెక్ట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులతోపాటు పలువురు అభిమానులు సైతం ఆదిపురుష్‌పై మండిపడుతున్నారు. రామాయణం ఇతివృత్తంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పాత్రలను అపహాస్యం చేస్తూ విజువల్ ఎఫెక్ట్స్ జోడించారని, పాత్ర వేషధారణ పట్ల పలువురు హిందుత్వ వాదులు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. దీంతో భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఎక్కువగా ట్రోల్ చేయబడిన సినిమా టీజర్‌గా ఆదిపురుష్ నిలిచింది.
నిజానికి బాహుబలి మువీ మేకింగ్ సమయంలో ప్రభాస్ మోకాలికి తీవ్రంగా గాయమైంది. ఆదిపురుష్‌లో పలు సన్నివేశాలు మొకాలితో చేయవల్సి వచ్చాయి. అటువంటి కఠినమైన సీన్‌లలో ప్రబాస్ నటించకూడదని వైద్యులు సూచించారు. దీంతో చేసేది లేక పోస్ట్ ప్రొడక్షన్ దశలో చిత్ర బృందం కొన్ని జిమ్మిక్కులను ఉపయోగించింది. దీంతో మొదటికే మోసం వచ్చింది. ఇక డైరెక్టర్ ఓం రౌత్ బాధ్యత తీసుకోకుండా డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయి ఈ సినిమా సెల్ ఫోన్ వంటి చిన్న స్క్రీన్ కోసం తియ్యలేదు. థియేటర్‌లో పెద్ద స్క్రీన్‌పై బాగా కనిపిస్తుందని స్పందించారు. ఐతే అవతార్, బాహుబలి, ఆర్ఆర్‌ఆర్ వంటి వీఎప్‌ఎక్స్ ఆధారిత టీజర్ ట్రైలర్‌లు యూట్యూబ్‌లో ఎలా నెగ్గుకొచ్చాయో? ఆదిపురుష్ టీజర్ ట్రైలర్‌కు మాత్రమే ఇంతటి షాక్ ఎందుకు తగిలిందో ఓం రౌత్ వెల్లడించలేదు. అంతేకాకుండా పాత్రల ఆహార్యంపై కూడా ఓం రౌత్ స్పందించకపోవడం గమనార్హం.
#Adipursh Team in damage control mode with 3D Media Screenings! Hyderabad will also happen tomorrow. But 3D has nothing to do with all the objections being raised against the weird appearances and accusations from Politicians that Looks of Few Roles distorts History! pic.twitter.com/ZGD8LFqIyE
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) October 5, 2022
ఐతే తాజాగా ఈ చిత్ర బృందం చేసిన పొరబాట్లను సరిదిద్దుకునే పనిలో పడింది. ‘ఆదిపురుష్’ టీజర్‌ను హైదరాబాద్ వేదికగా 3డీలో ఈ రోజు విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విమర్శలపై మరోసారి స్పందించారు. రామాయణ పాత్రలను ఎక్కడా అవమానపరచకుండా సినిమాని తెరకెక్కించామని, సినిమా చూస్తే మీకే అర్ధం అవుతుందని డైరెక్టర్ ఓంరౌత్ స్పష్టం చేశారు. చిత్రయూనిట్‌తోపాటు ముఖ్య అతిధిగా విచ్చేసిన దిల్ రాజు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. బాహుబలి-1 మొదటిసారి చూసినప్పుడు కూడా ఇలానే ట్రోల్స్ వచ్చాయి. తర్వాత ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో మీ అందరికీ తెలుసు. ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలి. సెల్‌ఫోన్‌లో చూసి సినిమాను అంచనా వేయలేం. ‘ఆదిపురుష్’ కూడా అలాంటి సినిమానే. 3డీలో విజువల్స్ చూస్తే మీకే తెలుస్తుందని దిల్ రాజు అన్నారు.