- Telugu News Photo Gallery Technology photos Nokia launches new smart phone nokia g11 plus features and price details Telugu Tech news
Nokia G11 Plus: కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. తక్కువ బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్..
ఒకప్పుడు మొబైల్ ఫోన్ రంగంలో వెలుగు వెలిగిన నోకియా ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లతో మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల వరుసగా ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. తాజాగా నోకియా జీ11 ప్లస్ పేరుతో ఓ బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసింది..
Updated on: Oct 08, 2022 | 10:36 AM

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తన ముద్ర వేయడానికి నోకియా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల వరుసగా ఆండ్రాయిడ్ ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో తక్కువ బడ్జెట్ ఫోన్‌ను నోకియా విడుదల చేసింది. తాజాగా భారత్‌లో ఈ ఫోన్‌ను నోకియా లాంచ్ చేసింది.

ఈ ఫోన్‌ను కేవలం 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో ఒకే వెర్షన్‌లో తీసుకొచ్చింది. ఈ ఫోణ్ రూ. 12,499కి అందుబాటులో ఉంది. లేక్ బ్లూ, చార్‌కోల్ గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 90 Hz రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఈ స్క్రీన్ సొంతం. ఇక ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో Unisoc T606 SoC ప్రాసెసర్‌ను ఇచ్చారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికొస్తే ఎస్డీ కార్డు ద్వారా ఇంటర్నల్ మెమొరీని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులో 10 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ అందించిన ఈ ఫోన్‌ను ఐపీ52 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు.





























