Youtube: యూట్యూబ్‌లో ఆ వీడియోలు ఇకపై ఉచితంగా చూడలేమా.? కీలక నిర్ణయం దిశగా అడుగులు…

యూట్యూబ్‌ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే వెంటనే యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి సెర్చ్‌ చేసే రోజులు వచ్చేశాయ్‌. ఈ వీడియో ప్లాట్‌ఫామ్‌తో ఓ వైపు క్రియేటర్స్‌కి, మరోవైపు యూట్యూబ్‌కి కాసుల పంటపండుతోంది..

Youtube: యూట్యూబ్‌లో ఆ వీడియోలు ఇకపై ఉచితంగా చూడలేమా.? కీలక నిర్ణయం దిశగా అడుగులు...
Youtube
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 07, 2022 | 2:24 PM

యూట్యూబ్‌ ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే వెంటనే యూట్యూబ్‌ ఓపెన్‌ చేసి సెర్చ్‌ చేసే రోజులు వచ్చేశాయ్‌. ఈ వీడియో ప్లాట్‌ఫామ్‌తో ఓ వైపు క్రియేటర్స్‌కి, మరోవైపు యూట్యూబ్‌కి కాసుల పంటపండుతోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్‌ తన ఆదాయాన్ని మరింత పెంచుకునే క్రమంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే యూట్యూబ్‌ ప్రీమియం పేరుతో యూజర్లకు సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ తీసుకొచ్చిన విషం తెలిసిందే. డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న వారికి ప్రత్యేక కంటెంట్‌ను అందిస్తూ వస్తోన్న యూట్యూబ్‌ తాజాగా ఆదాయమార్గాన్ని పెంచుకునే దిశగా మరో అడుగు ముందుకేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే ఇకపై యూట్యూబ్‌లో 4కే రెజల్యూషన్‌ వీడియోలను చూడాలంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ తప్పనిసరి చేసే ప్లాన్‌లో ఉందని సమాచారం. ప్రస్తుతం ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా యూజర్లు ఎలాంటి యాడ్స్‌ లేకుండా వీడియోలు చూసే అవాకశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందుకోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ. 399, సంవత్సరానికి ₹1290 చెల్లించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఇకపై 4కే వీడియోలను చూడాలంటే కచ్చితంగా ప్రీమియం చెల్చించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 4కే వీడియోలు చూడాలంటే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్స్ వస్తున్నట్టు కొందరు యూజర్లు రెడిట్ ప్లాట్‌ఫాంలో పేర్కొనడంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్