Rajasthan: రాజస్థాన్‌లో అదానీ భారీ పెట్టుబడులు.. ప్రశంసించిన సీఎం గహ్లోత్.. రాహుల్ గాంధీ రియాక్షన్ ఏంటంటే?
జైపుర్‌లో ‘ఇన్వెస్ట్ రాజస్థాన్ 2022’ పేరిట జరిగిన సదస్సులో గౌతమ్ అదానీ రాజస్థాన్‌కు 65 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. ఈ సమయంలో గహ్లోత్, అదానీ పక్కపక్కనే కూర్చొని ముచ్చటించారు. సీఎం గౌతమ్ అదానీని ప్రశంసించారు.
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీని ప్రశంసించడం రాజకీయ విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ విధానాలను ప్రశ్నించేప్పుడు అంబానీ, అదానీ పేర్లనే ప్రస్తావిస్తుంటారు. ఈ సమయంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గహ్లోత్ విధానాన్ని బీజేపీ ఎత్తిచూపుతోంది. జైపుర్‌లో ‘ఇన్వెస్ట్ రాజస్థాన్ 2022’ పేరిట జరిగిన సదస్సులో గౌతమ్ అదానీ రాజస్థాన్‌కు 65 వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. ఈ సమయంలో గహ్లోత్, అదానీ పక్కపక్కనే కూర్చొని ముచ్చటించారు. సీఎం గౌతమ్ అదానీని ప్రశంసించారు. అదానీ భాయ్ అంటూ ఆత్మీయంగా పిలిచారు. ఈ పరిణామం బీజేపీకి ఆయుధంగా మారింది. అదానీని గహ్లోత్ ఆహ్వానించడం.. గాంధీ కుటుంబంపై అసమ్మతికి నిదర్శమని కామెంట్ చేసింది బీజేపీ. అదానీ, అంబానీలను విమర్శించడంలో అలసిపోని రాహుల్‌గాంధీకి ఇది బహిరంగ సందేశం అంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
After Ashok Gehlot cornered the Gandhis by extending red carpet to Gautam Adani, cat got the unusually belligerent Rahul Gandhi’s tongue, who struggled to explain that he wasn’t opposed to Ambani-Adanis and welcomed investments. Gehlot’s maneuvers have left him red faced, again…
ఇవి కూడా చదవండి— Amit Malviya (@amitmalviya) October 8, 2022
వ్యాపారవేత్తలకు వ్యతిరేకం కాదు..
కాగా భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ బీజేపీ విమర్శలపై స్పందించారు. తాను ఏ వ్యాపారవేత్తకు వ్యతిరేకం కాదని.. గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో 60 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టేందుకు అదానీ ముందుకొచ్చారని.. అలాంటి ఆఫర్‌ను ఏ ముఖ్యమంత్రి వదులుకోరన్నారు రాహుల్. నిర్దిష్టంగా కొన్ని వ్యాపార సంస్థలకు సహాయపడటం కోసం రాజకీయ అధికారాన్ని ఉపయోగించడాన్నే తాను వ్యతిరేకిస్తానన్నారు. రెండు లేదా మూడు లేదా నాలుగు పెద్ద వ్యాపార సంస్థలు దేశంలోని ప్రతి వ్యాపారంపైనా గుత్తాధిపత్యం సాధించడానికి రాజకీయంగా సహాయపడటానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.రాజస్థాన్‌లో అదానీ గ్రూప్‌నకు సహాయపడేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ అధికారాన్ని ఉపయోగించలేదని, ఒకవేళ అలా చేసిననాడు తాను వ్యతిరేకిస్తానని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..