AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay- Rashmika: రష్మిక తన పెళ్లికి మమ్మల్ని పిలవదు.. ఈ విషయం మాకు ముందే తెలుసు.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నాల వివాహం ఫిబ్రవరి 26న జరగనుంది. ఇందుకోసం ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఇప్పటికే ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే విజయ్- రష్మికల పెళ్లి పై ఓ ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Vijay- Rashmika: రష్మిక తన పెళ్లికి మమ్మల్ని పిలవదు.. ఈ విషయం మాకు ముందే తెలుసు.. ప్రముఖ నటుడి కామెంట్స్ వైరల్
Vijay And Rashmika
Basha Shek
|

Updated on: Feb 20, 2026 | 9:06 PM

Share

టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల పెళ్లి ముహూర్తానికి సమయం దగ్గరపడుతోంది. తమ పెళ్లి విషయమై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ వారి కుటుంబ సభ్యులెవరూ కూడా అధికారికంగా ప్రకటించకపోయినా పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్ ఇంటికి లైటింగ్ డెకరేషన్ కూడా పెట్టారు. అలాగే శుభలేఖల పంపిణీ కూడా జరుగుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ లోని ఓ ప్యాలెస్ లో విజయ్ దేవర కొండ-రష్మిక మందన్నాల పెళ్లి జరగనుంది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే మార్చ్ 4న హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు విజయ్-రష్మిక. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ రిసెప్షన్ కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్-రష్మికల పెళ్లిపై ప్రముఖ కన్నడ నటుడు ప్రమోద్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటుడు రక్షిత్‌ శెట్టిని, తనను ఆమె వివాహానికి ఆహ్వానించదని, ఈ విషయం తమకు ముందే తెలుసంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కాగా ‘కిరిక్ పార్టీ’ సినిమాలో రక్షిత్ శెట్టి సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది . ఆ సినిమాలో రిషబ్ శెట్టి, ప్రమోద్ శెట్టి కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ లోనే రక్షిత్, రష్మిక ప్రేమలో పడ్డారు. ఇద్దరూ గ్రాండ్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఏమైందో తెలియదు కానీ వివాహం చేసుకోకుండానే వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి రష్మిక మందన్న మొత్తం శెట్టి గ్యాంగ్ కి దూరంగా ఉంటోంది. ఇప్పుడు ఆమె విజయ్ దేవరకొండతో పెళ్లికి రెడీ అవుతోంది. ఈ క్రమంలో రష్మిక, విజయ్‌ దేవరకొండ ల వివాహానికి తమను ఆహ్వానిస్తారని వేచి చూడడం లేదని నటుడు ప్రమోద్‌శెట్టి తెలిపాడు. నటుడు రక్షిత్‌ శెట్టిని, తనను ఆమె వివాహానికి ఆహ్వానిస్తారని భావించడం లేదని స్పష్టం చేశాడు. ఎందుకని అడిగితే, ‘అది అందరికీ తెలిసిన విషయమే’ అని ప్రమోద్ శెట్టి అన్నాడు. రక్షిత్‌ ప్రస్తుతం పూర్తిగా సినిమాల పనుల్లో బిజీగా ఉన్నాడని, రష్మికతో వివాహం కానందుకు రక్షిత్‌ బాధపడడం లేదని నటుడు తెలిపాడు. ఒక వేళ ఆహ్వానం వస్తే తాను కచ్చితంగా రష్మిక వివాహానికి వెళ్తానని ప్రమోద్ శెట్టి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈనటుడి కామెంట్స్ నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

నటుడు ప్రమోద్ శెట్టి ఇన్ స్టా ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us