AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: అతనిలా డైలాగులు రాసేవాళ్లు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరు.. ఆ డైరెక్టర్‌పై ప్రభాస్ ప్రశంసలు

ఇటీవలే ది రాజాసాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా ఆడియెన్స్ ను నిరాశ పర్చినా డార్లింగ్ అభిమానులకు బాగా నచ్చేసింది. ప్రస్తుతం తన తర్వాతి సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు ప్రభాస్.

Prabhas: అతనిలా డైలాగులు రాసేవాళ్లు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరు.. ఆ డైరెక్టర్‌పై ప్రభాస్ ప్రశంసలు
Prabhas
Basha Shek
|

Updated on: Feb 20, 2026 | 8:33 PM

Share

సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రభాస్ తో కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా ప్రభాస్ తో కలిసి సరదాగా ముచ్చట్లు పెట్టారు సంతోష్, మానస వారణాసి. తమకు ఇష్టమైన సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన ‘ఏక్ నిరంజన్’ సినిమా తన ఫేవరేట్ అని సంతోష్ చెప్పాడు. అందులో చింటూ క్యారక్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ జెమ్ అని, ఆ సినిమాలో ప్రభాస్ డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉందన్నాడు యంగ్ హీరో. దీనికి రిప్లై ఇచ్చిన ప్రభాస్.. ‘ఏక్ నిరంజన్’ సినిమా చెబుతుంటే తనకు చాలా హ్యాపీగా ఉందన్నాడు.. ‘పూరి జగన్నాథ్‌లా డైలాగులు ఎవరూ రాయలేరు. ఆయన నాకు ‘బుజ్జిగాడు’ క్యారక్టర్ చెప్పినప్పుడు పిచ్చెక్కిపోయింది. ఎలా చేయాలి.. నేనెప్పుడూ ఇలా చేయలేదే అని టెన్షన్‌ పెరిగిపోయింది. ఆయన రాసిన డైలాగులకు నేను ఆశ్చర్యపోయాను. బుజ్జిగాడు క్యారెక్టర్ కు నేను సూపర్ ఎగ్జైటెడ్ అయ్యాను. పూరీ గారిలా క్యారక్టరైజేషన్ రాసేవాడు, ఆయనలా రైటింగ్, క్యారక్టర్ డిజైనింగ్ చేసేవారు ఇండియాలోనే కాదు..ప్రపంచలోనే ఎవరూ లేరు’ అని పూరీపై ప్రశంసలు కురిపించాడు ప్రభాస్.

కాగా ప్రభాస్ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ సినిమాలు వచ్చాయి. ఇందులో బుజ్జిగాడు సూపర్ హిట్ కాగా ఏక్ నిరంజన్ మాత్రం ఫ్లాప్ అయ్యింద. అయితే రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ రెండు సినిమాలను తన కెరీర్ లో ప్రత్యేకంగా భావిస్తాడు ప్రభాస్. ఈ విషయాన్ని పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు ప్రభాస్. పూరీపై ప్రశంసలు కురిపించాడు. ఇక ది రాజా సాబ్ తర్వాత ఫౌజీ సినిమా షూటింగులో పాల్గొంటున్నాడు డార్లింగ్. హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కొత్త అమ్మాయి ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తోంది. దీనితో పాటు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమాలోనూ యాక్ట్ చేస్తున్నాడు ప్రభాస్. అలాగే సలార్ 2, కల్కి 2 సినిమాలను కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us