AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beach Travel: బీచ్‌కి వెళ్తున్నారా?.. అక్కడ కనిపించే ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తేకండి..

సముద్రపు అలలు, ఇసుక తిన్నెలు మనకు ప్రశాంతతను ఇస్తాయి. కానీ, బీచ్‌ నుంచి జ్ఞాపకంగా మనం తెచ్చుకునే చిన్న చిన్న వస్తువులు ఎన్నో ప్రమాదాలకు కారణమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అక్కడి వాతావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు. మరి బీచ్‌ నుంచి ఇంటికి ఏ వస్తువులను తీసుకురాకూడదు వంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

Beach Travel: బీచ్‌కి వెళ్తున్నారా?.. అక్కడ కనిపించే ఈ 5 వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తేకండి..
Beach Travel Tips
Bhavani
|

Updated on: Feb 20, 2026 | 8:10 PM

Share

సముద్రం అంటే కేవలం అలలు మాత్రమే కాదు.. అది ఒక అద్భుతమైన జీవ వ్యవస్థ. బీచ్ ట్రిప్‌కు వెళ్ళినప్పుడు చాలామంది అక్కడి ఇసుకను, గులకరాళ్లను జ్ఞాపకంగా తెచ్చుకుంటుంటారు. ఇది చూసేందుకు చిన్న విషయంగా అనిపించినా, పర్యావరణంపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇసుక – తీరానికి కవచం!

తీరంలో ఉండే ఇసుక కేవలం ఆటలకే కాదు, అలల ఉధృతిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కోట్లాది మంది పర్యాటకులు తలో కొంచెం ఇసుకను పట్టుకుపోతే, భవిష్యత్తులో తీర ప్రాంతాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది.

షెల్స్ – చిన్న జీవుల ఇళ్లు!

మనం అందంగా ఉన్నాయని ఏరుకునే సిప్పీలు, షెల్స్ సముద్రంలోని పీతలు, ఇతర చిన్న జీవులకు ఇళ్ల వంటివి. అవి తీరంలోనే ఉంటేనే ఆ జీవ చక్రం సక్రమంగా సాగుతుంది. అవి ఇసుకలో కలిసిపోయి సహజ సిద్ధమైన పోషకాలను కూడా అందిస్తాయి.

కొరల్స్.. సముద్రపు అడవులు!

సముద్రంలో ఉండే కొరల్ రీఫ్స్ (పగడపు దిబ్బలు) సముద్రపు అడవుల వంటివి. ఒక చిన్న కొరల్ ముక్కను మనం ఇంటికి తెచ్చినా, అది కొన్ని వందల సముద్ర జీవుల ఆశ్రయాన్ని దెబ్బతీసినట్లే అవుతుంది.

ప్రకృతిని మనం గౌరవించినప్పుడే అది మనల్ని కాపాడుతుంది. బీచ్‌కి వెళ్ళినప్పుడు ఫోటోలు, మధుర జ్ఞాపకాలను మాత్రమే వెంట తెచ్చుకోండి.. ప్రకృతికి చెందిన వస్తువులను మాత్రం అక్కడే వదిలేయండి. మీ చిన్న మార్పు పర్యావరణానికి పెద్ద సహాయం అవుతుంది.

Follow Us
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వాస్తు : ఇంటికి దురదృష్టం తెచ్చే మొక్కలు ఇవే.. ఎక్కడ ఉన్నా నష్టమే
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
వైభవ్ సూర్యవంశీకు ఆ బలహీనత.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్..!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే శుభవార్త