పెద్ది రీ సౌండ్ నెక్స్ట్ లెవల్‌లో ఉందిగా..!
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రాబోతున్న పెద్ది సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో మొదలై జూన్ 2 వరకు నాన్-స్టాప్ ఈవెంట్‌లు ప్లాన్ చేశారు. కీలక పాత్రల పరిచయంతో పాటు, సినిమా నిడివి మూడు గంటలకు పైగా ఉంటుందని, చివరి 20 నిమిషాలు రామ్ చరణ్ నట విశ్వరూపం ఉంటుందని బుచ్చిబాబు తెలిపారు.
బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఊపందుకున్నాయి. మే 18 నుంచి జూన్ 3 సాయంత్రం ప్రీమియర్స్ పడే ముందురోజు వరకు నాన్-స్టాప్ ప్రమోషనల్ రూట్ మ్యాప్ సిద్ధంగా ఉంది. మే 18న ముంబైలో ట్రైలర్ లాంచ్‌తో ఈ ప్రమోషన్లు ప్రారంభమవుతాయి. అనంతరం మే 22న ఉప్పల్ స్టేడియం, 23న భూపాల్‌లో సాంగ్ లాంచ్, 24న బెంగళూరు, 28న ఢిల్లీ, 30న చెన్నై, జూన్ 1న విజయనగరం, 2న హైదరాబాద్‌లలో ఈవెంట్‌లు నిర్వహించనున్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ట్రైలర్ రిలీజ్‌కు ముందే సినిమాలోని ముఖ్య పాత్రలను పరిచయం చేస్తున్నారు. శివరాజ్ కుమార్ గౌరు నాయుడు పాత్రలో, దివ్యేందు శర్మ రాంబుజ్జి పాత్రలో, జగపతి బాబు అప్పాల సూరి పాత్రలో నటిస్తున్నారు. పెద్ది సినిమా నిడివి మూడు గంటలకు పైగా ఉంటుందని, చివరి 20 నిమిషాలు రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని బుచ్చిబాబు వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం :
రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్ కావాలంటున్న స్టార్స్!
భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

