AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Nutrition: గుండె పదిలంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే.. సముద్రపు చేపల్లో ఉండే ఆ సీక్రెట్ ఇదే..

చేపలంటే ఇష్టపడని వారుండరు. అయితే మార్కెట్‌కు వెళ్ళినప్పుడు సముద్రపు చేపలు కొనాలా లేక చెరువు చేపలు కొనాలా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. రుచిలో, పోషకాల్లో ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. మెదడు చురుకుదనం నుంచి గుండె ఆరోగ్యం వరకు ఏ చేపలు ఎలాంటి మేలు చేస్తాయో అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Fish Nutrition: గుండె పదిలంగా ఉండాలంటే వీటిని తినాల్సిందే.. సముద్రపు చేపల్లో ఉండే ఆ సీక్రెట్ ఇదే..
Sea Fish Vs Freshwater Fish
Bhavani
|

Updated on: Feb 20, 2026 | 6:07 PM

Share

చేపలు ప్రోటీన్లకు నిలయం. వీకెండ్ వచ్చిందంటే చాలు చేపలు ఇష్టంగా తినేవారు దుకాణాల ముందు బారులు తీరి కనిపిస్తుంటారు. కానీ మీరు ఎంచుకునే చేప రకాన్ని బట్టి మీ శరీరానికి అందే పోషకాలు మారుతుంటాయి. తీర ప్రాంతాల వారు సముద్రపు చేపలను, మైదాన ప్రాంతాల వారు మంచినీటి చేపలను ఇష్టపడతారు. మరి ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది అత్యుత్తమమో ఇప్పుడు చూద్దాం..

ఒమేగా-3 మ్యాజిక్!

గుండె మెదడు ఆరోగ్యానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎంతో అవసరం. సముద్రపు నీటిలో ఉండే లవణాలు, నాచు వల్ల సాల్మన్, సీ బాస్ వంటి చేపల్లో ఈ పోషకాలు అపరిమితంగా ఉంటాయి. మంచినీటి చేపల్లో ఒమేగా-3 కొంత తక్కువగా ఉన్నప్పటికీ, సరైన మేత వేసి పెంచిన చెరువు చేపల్లోనూ ఇది లభిస్తుంది.

రుచిలో వైవిధ్యం!

సముద్రపు చేపలు సహజంగానే కొంచెం ఉప్పగా ఉంటాయి. ఇవి ఫ్రై చేసుకుంటే అదిరిపోయే టేస్ట్ ఇస్తాయి. అదే మంచినీటి చేపల విషయానికొస్తే.. రోహు, కట్ల వంటివి మసాలాను బాగా పీల్చుకుంటాయి. అందుకే ఆంధ్ర స్టైల్ చేపల పులుసులకు ఇవి మొదటి ఛాయిస్.

మెర్క్యురీ ముప్పు.. చిన్న చేపలే రక్ష!

పెద్ద చేపలు (ఉదాహరణకు పెద్ద ట్యూనా లేదా షార్క్) ఎక్కువ కాలం జీవించడం వల్ల వాటి శరీరంలో పాదరసం (Mercury) పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే ఆరోగ్య నిపుణులు చిన్న చేపలైన సార్డైన్ (మత్తి), ఆంకోవీస్ (నేత్తళ్లు), తిలాపియా వంటి వాటిని తినాలని సూచిస్తున్నారు. ఇవి సురక్షితం  పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఏది ఎంచుకోవాలి?

మీకు ఘాటైన రుచి, ఎక్కువ పోషకాలు కావాలంటే సముద్రపు చేపలు ఎంచుకోండి. తేలికగా జీర్ణమవ్వాలి, తక్కువ ధరలో దొరకాలి అనుకుంటే మంచినీటి చేపలు మేలు. వారానికి కనీసం రెండుసార్లు చిన్న చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించే ముందు ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.

Follow Us
మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్
మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్..
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి..మామిడి పండ్లు రోడ్డుపాలు
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
కోళ్లగూడు క్లీన్ చేస్తుంటే ఊహించని సీన్.. ఎర్రతేలు వీపుపై ఏముందో
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
హార్ట్ షేప్ సరస్సు..ఇంతటి అందం..దక్షిణ భారతదేశంలో ఎక్కడ ఉందంటే..
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన విశాల్
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..
తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు..