మండే ఎండలో శరీరానికి చలువనిచ్చే కీరదోస దాదాపు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ కీరదోస వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి
TV9 Telugu
ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఎండాకాలంలో దీన్ని నేరుగా తీసుకోవడంతో పాటు సలాడ్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు
TV9 Telugu
ఎండాకాలంలో శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా శరీరం శక్తిని కోల్పోతుంది. కాబట్టి కోల్పోయిన నీటితో పాటు శక్తిని తిరిగి పొందడానికి కీరాదోస బాగా ఉపయోగపడుతుందట
TV9 Telugu
అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయట. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరాదోస కూడా ఒకటి
TV9 Telugu
దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందచ్చు. తద్వారా శరీరానికి చలువ కూడా చేస్తుంది. కీరాదోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుందట. అందుకే జ్వరంతో బాధపడుతున్న వారికి దీన్ని ఎక్కువగా ఇస్తుంటారంటున్నారు నిపుణులు
TV9 Telugu
కళ్లు అలసిపోవడం, కళ్ల కింద క్యారీ బ్యాగ్స్.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి కీరాదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందట
TV9 Telugu
చర్మ ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్.. వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి చర్మానికి సంబంధించిన రకరకాల బ్యూటీ ట్రీట్‌మెంట్లలో కీరాను ఉపయోగిస్తుంటారు
TV9 Telugu
ఇందులో ఉండే సిలికా వల్ల జుట్టు, గోళ్లు దృఢంగా తయారవుతాయట. అలాగే ఇది చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలో కీరాదోస బాగా ఉపయోగపడుతుంది