AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా

చిలుకూరు బాలాజీ ఆలయాన్ని.. టార్గెట్ చేసిన అమెరికా

Samatha J
|

Updated on: May 17, 2026 | 1:59 PM

Share

హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయాన్ని టార్గెట్‌ చేస్తూ అమెరికా సెనేటర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా హెచ్-1బీ వీసా కార్యక్రమంపై విమర్శలు గుప్పించిన అమెరికా రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. హైదరాబాద్‌ సమీపంలోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని 'వీసా కార్టెల్' అంటే..ఓ మాఫియాగా అభివర్ణించడం ఇప్పుడు ఇండో-అమెరికన్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. దీనిపై ఇటు భారత్ లో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా హెచ్‌1బీ వీసాల మాటున అమెరికాలోని ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారని మిస్సౌరీ సెనేటర్‌ ఎరిక్‌ స్మిత్ విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా వీసా కార్టెల్‌ నడుస్తోందని, వారికి హైదరాబాద్‌లో ఒక వీసాల దేవాలయం ఉందని చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతీయులపై.. ముఖ్యంగా హైదరాబాదీయులపై వరుస ట్వీట్లలో ఆయన అక్కసు వెళ్లగక్కారు. అమెరికా ఉపాధి ఆధారిత వీసాల వ్యవస్థపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎరిక్‌ స్మిత్‌ కేవలం బాలాజీ ఆలయాన్ని మాత్రమే కాకుండా, అమెరికాలోని ప్రస్తుత ఉపాధి ఆధారిత వీసా విధానంపై కూడా నిప్పులు చెరిగారు. H-1B, L-1, F-1 మరియు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) వంటి వీసా ప్రోగ్రామ్‌లు అమెరికన్ మధ్యతరగతి ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ గతంలో ప్రచురించిన ఒక కథనాన్ని ఉటంకిస్తూ.. హైదరాబాద్‌లోని చిలుకూరు బాలాజీ ఆలయ ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ వ్యవస్థ ఎంతగా ఓ ‘గేమ్’ గా మార్చారో చెప్పడానికి ఇదే నిదర్శనమని స్మిత్‌ పేర్కొన్నారు. “ఈ వీసా కార్టెల్‌కు హైదరాబాద్‌లో ఒక ‘వీసా టెంపుల్’ కూడా ఉంది.

మరిన్ని వీడియోల కోసం :

రిజల్ట్‌తో సంబంధమే లేదు.. బ్రేక్‌ కావాలంటున్న స్టార్స్‌!

భారీ బడ్జెట్ సినిమాలకు ఆర్థిక ఇబ్బందులు

ట్రెండింగ్ బ్యూటీ హెల్ప్ తీసుకుంటున్న చియాన్‌ విక్రమ్‌

డైలాగ్ వార్ : ఇండస్ట్రీ ఇగోస్

ఫిలిం ఛాంబర్‌లో వాడివేడి చర్చ

Follow Us