వేసవిలో ప్రతి రోజూ జీలకర్ర నీరు తాగితే.. మీలో వచ్చే మార్పులు ఇవే!

18 May 2026

Anand T

వేసవిలో మీరు తగినంత నీరు తాగకపోతే, మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీని వల్ల మీరు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. 

కాబట్టి వేసవితో జీలకర్ర నీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పరగడుపున జీలకర్ర నీరు తాగడం వల్ల రోజంతా మీకు తగినంత శక్తి లభిస్తుంది.

ఇందుకోసం మీరు ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రను 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించండి. అది కొద్దిగా చల్లారిన తర్వాత వడకట్టి తాగండి.

ఇలా మీరు రోజు క్రమం తప్పకుండా జీలకర్ర నీటిని తాగడం వల్ల మీ కాలేయం సరిగ్గా నిర్విషీకరణ చెందుతుంది. దీని వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు

అలాగే ప్రతిరోజూ జీలకర్ర నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా వేసవిలో కలిగే వికారం, వాంతులు కూడా తగ్గుతాయి.

జీలకర్ర నీటిలోని యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనతతో పోరాడటానికి సహాయపడతాయి.

 మీరు రోజు జీలకర్ర నీరు తాగడం వల్ల అది శరీరం నుండి విషపదార్థాలను తొలగిస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

ఉదయం పూట ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగడం వల్ల సులభంగా మీరు బరువు తగ్గవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్