లాంగ్ బ్రేక్ తీసుకుంటున్న గ్లామర్ క్వీన్స్
టాలీవుడ్‌లో కీర్తి సురేష్, పూజా హెగ్డే, కృతి శెట్టి, సమంత వంటి స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. థియేటర్లలో వారి గ్లామర్ మెరుపులు లేక అభిమానులు ఎదురుచూస్తున్నారు. వెండితెరపై ఏర్పడిన ఈ గ్లామర్ గ్యాప్‌ను భర్తీ చేస్తూ త్వరలోనే వీరు బిగ్ బ్యాంగ్‌తో తిరిగి వస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
వెండితెరపై తమ అభిమాన హీరోయిన్ కనిపిస్తే ఆ కిక్కే వేరు. కానీ ఇప్పుడు థియేటర్లలో స్టార్ హీరోయిన్ల గ్లామర్ మెరుపులు లేక అభిమానుల గుండెల్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. మహానటి, బుట్టబొమ్మ, బేబమ్మ వంటి తారలు మళ్ళీ ఎప్పుడు వస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. “మహానటి”గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కీర్తి సురేష్ టాలీవుడ్‌లో కనిపించి రెండేళ్లు పూర్తయింది. హోమ్లీ లుక్‌తో ఆకట్టుకునే ఈ బ్యూటీ ప్రస్తుతం ఇతర భాషలలో బిజీగా ఉన్నప్పటికీ, తెలుగు సినిమాలో ఆమె మ్యాజిక్ మిస్ అవుతోంది. “బుట్టబొమ్మ” పూజా హెగ్డే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ తెరపై మెరిసి మూడేళ్లు గడిచిపోయింది. ఒకప్పుడు టాలీవుడ్‌లోని టాప్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఫేవరెట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ గ్లామర్ క్వీన్‌కు ఇప్పుడు టాలీవుడ్ పెద్దగా స్పేస్ ఇవ్వడం లేదు. “బేబమ్మ”గా ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన కృతి శెట్టి కూడా టాలీవుడ్‌కు దూరమై రెండేళ్లు అవుతోంది.
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు
పైకి.. కిట్ కాట్ చాక్లెట్ ప్యాకెట్.. ఓపెన్ చేస్తే..
కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!
ప్రపంచంలోనే ధనిక గ్రామం.. భారత్‌లోనే...!
వానలో ఈ చెట్టు కింద నిల్చుంటే చావు ఖాయం!
ఇందూరు నయాగర జలపాతం ఎప్పుడైనా చూశారా?

