కాకినాడ జిల్లాలోని తుని వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. చెన్నాపట్నం కాఫీ సెంటర్ సమీపంలో బ్రేక్ ఫెయిల్ కావడంతో అతివేగంగా దూసుకొచ్చి పార్కింగ్‌లో ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసమవగా, ఓ సెక్యూరిటీ గార్డుకు గాయాలయ్యాయి. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది.