Peddi Trailer Event : పెద్ది అద్భుతమైన విజువల్ వండర్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. పలు కారణాలతో వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు జూన్ 4న పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన సంచలనం తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం మెగా ఫ్యాన్స్, పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 4న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. పీరియాడికి యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో విలక్షణ నటుడు జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదివరకే పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తుంది. మే 18న ఈ వేడుకను ముంబైలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ సెంటర్ లో సాయంత్రం నుంచి ఈ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకను మీరు టీవీ ఎంటర్టైన్మెంట్ (TV9 Entertainment)లో ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు.
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..

