AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Vijay: ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హీరో విశాల్.. ఏం జరిగిందంటే?

కొన్ని రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే విజయ్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురిపించాడు హీరో విశాల్. అయితే తాజాగా ఓ విషయంలో సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు విశాల్. ఈ మేరకు యాక్షన్ హీరో చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

CM Vijay: ఇది కరెక్ట్ కాదు సార్.. సీఎం విజయ్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హీరో విశాల్.. ఏం జరిగిందంటే?
Vishal, CM Vijay
Basha Shek
|

Updated on: May 18, 2026 | 4:54 PM

Share

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఎట్టకేలకు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ముఖ్యమంత్రి అయ్యాక విజయ్ తీసుకుంటోన్న కొన్ని సంచలన నిర్ణయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ మధ్యన మద్యం షాపుల విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. విజయ్ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు, హీరోల సైతం కొనియాడారు. ముఖ్యంగా హీరో విశాల్ విజయ్ కు థ్యాంక్స్ చెబుతూ ఓ పెద్ద ట్వీట్ కూడా పెట్టాడు. అయితే ఇది జరిగి వారం రోజులు కాలేదు. ఇదే విశాల్ ఓ విషయంలో సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాడు. ఈ మేరకు ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడది తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాట కొత్త మంత్రి వర్గం కొలువు తీరింది. ఇటీవలే పలువురు మంత్రులుగా కూడా ప్రమాణం చేయగా.. వారికి ఇటీవలే శాఖలను కూడా కేటాయించారు విజయ్. అయితే ఇందులో సినిమాటోగ్రఫీ శాఖను రాజ్ మోహన్ కు కేటాయించడంపై విశాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) లో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడీ యాక్షన్ హీరో.

‘ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి సీఎం విజయ్ మంత్రి పదవులు కేటాయించడం సంతోషంగా ఉంది. అయితే రాజ్ మోహన్ కు సినిమాటోగ్రఫీ శాఖ కేటాయించడం నన్ను ఎంతగానో నిరుత్సాహ పరిచింది. ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సినీ రంగానికి సంబంధించిన సమస్యలను, విజపులను ఏ అనుభవమూ లేని వ్యక్తికి ఎలా తెలియజేయగలం? 30 ఏళ్ల సినీ అనుభవం ఉన్న వ్యక్తిగా మీకు (సీఎం విజయ్నుద్దేశించి) క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయో పూర్తిగా తెలుసు. అలాంటిది, ఏ అనుభవమూ లేని వారికి ఎలా వివరించగలం? రాజమోహన్ ను కించేపరచడం నా ఉద్దేశం కాదు ‘ అని విశాల్ ప్రశ్నించారు. ఇదే సందర్భంగా సినీ పరిశ్రమకు సంబంధించి విశాల్ కొన్ని విజ్ఞప్తులను కూడా సీఎం విజయ్ ముందుంచారు.

ఇవి కూడా చదవండి

‘ప్రభుత్వ టికెటింగ్ విధానాన్ని తీసుకురావాలి. దీనివల్ల ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది. దేశమంంతటా ‘ఒకే దేశం ఒకే పన్ను విధానం’ అమలవుతుండగా.. రాష్ట్రంలో మాత్రం స్థానిక సంస్థల పన్ను లు విధిస్తున్నారు. దీన్ని రద్దు చేయాలి. చిన్న చిత్రాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి వినతిపత్రం రూపంలో ఇవ్వొచ్చని, కానీ, 9 ఏళ్లుగా ఇలాంటి వినతులు ఇస్తూనే ఉన్నాం. ఈ విషయాల్లో ముఖ్యమంత్రి తగిన నిర్ణయం తీసుకుని ఊరట కల్పిస్తారని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు విశాల్. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

హీరో విశాల్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us