ఉదయాన్నే మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే ఆ టెన్షన్ ఉండదు.. ఈ తప్పులు చేయొద్దు..
డయాబెటిస్ పెరిగిపోతోందని టెన్షన్ పడుతున్నారా? షుగర్ లెవెల్స్ ఎప్పుడు చూసినా మీ మైండ్ బ్లాక్ చేస్తున్నాయా? అయితే ఈ సింపుల్ కిచెన్ ట్రిక్ మీకోసమే.. ఎటువంటి ఖరీదైన ప్రొడక్ట్స్ అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే చల్లటి మజ్జిగతోనే డయాబెటిస్‌కు పక్కాగా చెక్ పెట్టవచ్చు. అయితే ఉత్త మజ్జిగ తాగితే సరిపోదు.. దానికి ఒక పవర్‌ఫుల్ ఔషధ పొడిని జత చేయాలి. అదేంటో తెలుసుకుందాం..

నేటి ఆధునిక జీవనశైలి, విపరీతమైన మానసిక ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా ఇళ్లలో షుగర్ ఒక సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. ఒక్కసారి ఈ చక్కెర వ్యాధి శరీరంలోకి ప్రవేశిస్తే.. దానిని పూర్తిగా నయం చేయడం కష్టం. కానీ సరైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీనవశైలి ద్వారా దీనిని ఖచ్చితంగా నియంత్రించవచ్చు. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు తాము తినే ప్రతి ముద్ద గురించి, తాగే ప్రతి చుక్క గురించి ఎంతో ఆలోచించాల్సి ఉంటుంది. అయితే మన ఇళ్లలోనే ఉండే అత్యంత చౌకైన, పాతకాలపు పానీయం ఒకటి మధుమేహ వ్యాధిగ్రస్తులకు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే మనందరికీ ప్రియమైన మజ్జిగ. మజ్జిగ అనేది ఒక సహజ ప్రోబయోటిక్ పానీయం. ఇందులో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉండటం వల్ల ఇది డయాబెటిస్ ఉన్నవారికి పూర్తిగా సురక్షితం. అయితే ఈ మామూలు మజ్జిగ తాగడానికి బదులుగా, దానికి ఒక ప్రత్యేకమైన పొడిని జత చేస్తే దాని శక్తి రెట్టింపు అవుతుంది. ఆ అద్భుత ఔషధ పొడియే జీలకర్ర పొడి.
జీలకర్ర పొడి.. ఒక ఔషధాల గని
జీలకర్ర కేవలం వంటల రుచిని పెంచే మసాలా దినుసు మాత్రమే కాదు, అది బోలెడన్ని ఔషధ గుణాల సమాహారం. ఇందులో ప్రోటీన్, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియంలతో పాటు విటమిన్-సి, కె, ఇ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వైద్య పరిశోధనల ప్రకారం.. జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. ముఖ్యంగా శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో జీలకర్ర కీలక పాత్ర పోషిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు తాజా మజ్జిగలో అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి కలిపి తాగడం చాలా ఉత్తమం. వీలైతే, భోజనం చేయడానికి ముందు కొన్ని జీలకర్ర గింజలను నోట్లో వేసుకుని కొద్దిగా నమలడం ఇంకా మంచిది. ఈ పానీయం చక్కెరను నియంత్రించడమే కాకుండా శరీరంలోని మెటబాలిజాన్ని పెంచి అధిక బరువు తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. మధుమేహం, ఊబకాయం సమస్యలు రెండూ ఉన్నవారికి ఇది ఒక అమృతం లాంటి పానీయం.
అద్భుత ప్రయోజనాలు..
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మజ్జిగలోని లాక్టిక్ ఆమ్లం జీర్ణవ్యవస్థను క్లీన్ చేస్తుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
రక్తపోటు నియంత్రణ: మజ్జిగలో పుష్కలంగా ఉండే పొటాషియం శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాకుండా, బ్లడ్ ప్రెజర్ (BP) ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా చూస్తుంది.
ఎముకల ఆరోగ్యం: ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్ లభిస్తాయి. ఇవి ఎముకలను, పళ్లను గట్టిపరచడంలో ఎంతగానో తోడ్పడతాయి.
గాయాలు త్వరగా మానతాయి: సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులలో చిన్న గాయాలైనా త్వరగా మానవు. అయితే మజ్జిగలో ఉండే జింక్ పోషకం బాడీలోని కణాలను యాక్టివేట్ చేసి గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు కూడా మజ్జిగ ఎంతో సురక్షితమైనది. అయితే మధుమేహం తీవ్రత అనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి మీ డైట్‌లో ఎలాంటి కొత్త ఆహార పద్ధతులను లేదా హోమ్ రెమెడీస్‌ను ఫాలో అయ్యే ముందైనా, ఒకసారి మీ ఫ్యామిలీ డాక్టర్‌ను లేదా డయాబెటాలజిస్ట్‌ను సంప్రదించడం ఎల్లప్పుడూ ఉత్తమం.
