తెల్లవారుజామున ఫోన్ వాడకం ఒత్తిడి, ఆందోళన కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి పరిష్కారంగా ఉదయం ఒకటి లేదా రెండు గంటల పాటు డిజిటల్ డిటాక్స్ అవశ్యకం. ప్రకృతిలో నడవడం, పుస్తకాలు చదవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల ఏకాగ్రత పెరిగి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. నీలి కాంతి ప్రభావం తగ్గి తలనొప్పి, నిద్రలేమి నుండి ఉపశమనం పొందవచ్చు.