AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Health : గర్భస్రావానికి దారితీసే పొరపాటు.. గర్భిణులు వీటి జోలికి వెళ్లకపోవడమే బెటర్..

పాలు కాల్షియం ప్రోటీన్లకు నిలయం. కానీ, గర్భిణీలు తాగే పాలు పచ్చివి అయితే మాత్రం అది పెను ప్రమాదానికి దారి తీయవచ్చు. మరిగించని పాలలో ఉండే హానికర బ్యాక్టీరియా తల్లికి మాత్రమే కాదు, గర్భంలోని బిడ్డకు కూడా ప్రాణసంకటంగా మారుతుంది. పచ్చి పాలు ఎందుకు తాగకూడదు? వీటి గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం సూచిస్తున్నారు? వివరాలు ఈ కథనంలో..

Pregnancy Health : గర్భస్రావానికి దారితీసే పొరపాటు.. గర్భిణులు వీటి జోలికి వెళ్లకపోవడమే బెటర్..
Pregnancy Diet Precautions
Bhavani
|

Updated on: Feb 20, 2026 | 5:44 PM

Share

గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా చాలా సార్లు ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతుల వంటివి తల్లి బిడ్డ ప్రాణాలకు ప్రమాదం. పాలు ఆరోగ్యానికి మంచివి కదా, పచ్చిగా తాగితే ఇంకా బలం వస్తుంది అనుకుంటే అది పొరపాటే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకు ప్రమాదకరం?

గర్భధారణ సమయంలో తల్లి రోగనిరోధక శక్తి సహజంగానే కొంత తగ్గుతుంది. పచ్చి పాలను మరిగించనప్పుడు అందులో ఉండే లిస్టీరియా వంటి బ్యాక్టీరియా త్వరగా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది. ఇది నేరుగా గర్భాశయంపై ప్రభావం చూపి, అకాల ప్రసవం (Pre-term labor) లేదా గర్భస్రావానికి దారి తీయవచ్చు.

బిడ్డపై ప్రభావం ఎలా ఉంటుంది?

తల్లికి సోకిన ఇన్ఫెక్షన్ ప్లేసెంటా ద్వారా శిశువుకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. దీనివల్ల శిశువు పుట్టకతోనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పుట్టవచ్చు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు.

పాస్చరైజేషన్ ఎందుకు ముఖ్యం?

పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద మరిగించడం వల్ల అందులోని పోషకాలు దెబ్బతినకుండానే హానికర సూక్ష్మజీవులు నశిస్తాయి. అందుకే మార్కెట్లో లభించే పాస్చరైజ్డ్ పాలు లేదా ఇంట్లో బాగా మరిగించిన పాలు మాత్రమే గర్భిణీలకు సురక్షితం.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

పచ్చి పాలతో చేసిన చీజ్ లేదా ఇతర పాల పదార్థాలకు దూరంగా ఉండాలి.

ఫ్రిజ్‌లో ఉన్న పాలను కూడా గడువు తేదీ చూసుకుని, మళ్లీ మరిగించి వాడటం ఉత్తమం.

పాల ఉత్పత్తులు కొనేటప్పుడు లేబుల్‌పై ‘Pasteurized’ అని ఉందో లేదో సరిచూసుకోవాలి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. వీటిని పాటించే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

Follow Us
సేమియా పాయసం చిక్కబడకుండా ఉండాలంటే ఇలా చేయండి..
సేమియా పాయసం చిక్కబడకుండా ఉండాలంటే ఇలా చేయండి..
ఐపీఎల్ కంటే డబుల్ మజా.. టీమిండియా షెడ్యూల్‌లో కీలక మార్పు
ఐపీఎల్ కంటే డబుల్ మజా.. టీమిండియా షెడ్యూల్‌లో కీలక మార్పు
ఆ హీరోయిన్ అందానికే నేను పడిపోయా..
ఆ హీరోయిన్ అందానికే నేను పడిపోయా..
యూరిన్ బ్యాగ్ పట్టుకుని రిక్షా తొక్కుతున్న వృద్ధుడు..చూస్తే
యూరిన్ బ్యాగ్ పట్టుకుని రిక్షా తొక్కుతున్న వృద్ధుడు..చూస్తే
మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్
మా అమ్మ కోరిక తీరింది.. జబర్దస్త్ కెవ్వు కార్తిక్ ఎమోషనల్ పోస్ట్
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్..
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై కంపెనీల బిగ్ అప్‌డేట్..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
ఎముకలకు బలాన్నిచ్చే కోడి కాళ్ల సూప్.. ఇలా తింటే ఎన్ని లాభాలో..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
బక్రీద్ పండుగ ఆ రోజు కాదు.. సెలవుపై అంతటా గందరగోళం..
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
ఐపీఎల్‌లో కోటీశ్వరుడు.. ఆటలో నిత్య దరిద్రుడు.. కట్‌చేస్తే.
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి,రోడ్డుపాలైన మామిడి పండ్లు
మహిళా రైతుపై తోపుడుబండ్ల వ్యాపారుల దాడి,రోడ్డుపాలైన మామిడి పండ్లు