మంచి జీర్ణక్రియకు ఇది రోజూ ఒక కప్పు తినండి

18 May 2026

TV9 Telugu

TV9 Telugu

వేసవిలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరం. అధిక ఉష్ణోగ్రతలకు జీర్ణక్రియ మందగించడం, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు రావడం సహజం. వీటికి చెక్‌ పెట్టాలంటే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు తప్పనిసరి

TV9 Telugu

మన శరీరంలోని రోగనిరోధక శక్తిలో దాదాపు 70-80 శాతం కేవలం జీర్ణాశయం, పేగులు పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే గట్‌ హెల్త్‌ బాగుంటేనే మనం ఉత్సాహంగా ఉండగలం

TV9 Telugu

వేసవిలో గట్‌ హెల్త్‌కు మజ్జిగను మించిన ఔషధం లేదు. ఇందులో ఉండే ప్రోబయాటిక్స్‌ పేగుల పనితీరును మెరుగుపరుస్తాయి. చల్లటి మజ్జిగలో కొంచెం అల్లం, కరివేపాకు, జీలకర్ర పొడి కలిపి తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది

TV9 Telugu

ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, పొట్టలోని మంటనూ తగ్గిస్తుంది. ఈ కాలంలో తప్పనిసరిగా చివరి ముద్దలో అయినా, భోజనం తర్వాతనైనా కప్పు పెరుగు తీసుకుంటే... ఇందులోని లాక్టోబాసిల్లస్‌ బ్యాక్టీరియా పేగుల్లోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది

TV9 Telugu

వేసవిలో వచ్చే విరేచనాలు, గ్యాస్ట్రిక్‌ సమస్యలను అరికట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వేసవిలో లభించే పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి

TV9 Telugu

నీటి శాతం ఎక్కువ ఉండే కీరదోసను తీసుకోవాలి. ఇది పొట్టను చల్లబరుస్తుంది. పుచ్చకాయ డీహైడ్రేషన్‌ బారిన పడకుండా కాపాడుతుంది. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ వంటివి తేలిగ్గా జీర్ణమవుతాయి

TV9 Telugu

నూనెలో వేయించిన పదార్థాలు, ఎక్కువ మసాలాలు ఉన్న కూరలు, కెఫీన్‌ ఎక్కువగా తీసుకోవడం గట్‌ హెల్త్‌కు మంచిది కాదు. ఇవి ఎసిడిటీని పెంచి, కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి

TV9 Telugu

అందుకే, ఈ కాలంలో వీటికి వీలైనంతవరకూ దూరంగా ఉండండి. అలానే, శీతల పానీయాల కంటే కొబ్బరినీళ్లు, నిమ్మరసం తీసుకోవడం ఉత్తమం. అసలు డీహైడ్రేషన్‌ సమస్య రానివ్వకుండా తగినన్ని నీళ్లు తాగడమూ, కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరి