మట్టికుండ నీరు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అనారోగ్యం తప్పదు!

18 May 2026

Jyothi Gadda

మట్టికుండలో లభించే సహజమైన చల్లదనం, ఆ మట్టి వాసన ఎంతో హాయినిస్తాయి. మట్టికుండ నీరు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

అయితే, మట్టికుండను ఉపయోగించేటప్పుడు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల మేలు జరగాల్సింది పోయి కీడు జరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నరు. ఆ ముఖ్యమైన తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చాలామంది మార్కెట్ నుండి కొత్త కుండను తెచ్చిన వెంటనే, అందులో నీళ్లు పోసి తాగేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. కొత్త కుండను ఉపయోగించే ముందు కనీసం ఒక రోజంతా నీళ్లలో పూర్తిగా నానబెట్టాలి.

ఆ తర్వాతే దాన్ని శుభ్రం చేసి వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల కుండలో ఉండే మట్టి రేణువులు, దుమ్ము పూర్తిగా తొలగిపోతాయి. కొత్త కుండను నేరుగా ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు!

మట్టికుండను శుభ్రం చేయడానికి ఎప్పుడూ పాత్రలు తోమే సబ్బులు, లిక్విడ్లు లేదా డిటర్జెంట్ పొడిని ఉపయోగించకూడదు. మట్టికి ఉండే సహజ లక్షణం వల్ల అది రసాయనాలను త్వరగా పీల్చుకుంటుంది.

ఆ తర్వాత మనం అందులో నీళ్లు పోసినప్పుడు, ఆ కెమికల్స్ నీటిలో కలిసి మన శరీరంలోకి చేరుతాయి. దీనివల్ల తీవ్రమైన కడుపునొప్పి, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కుండను కేవలం వేడి నీళ్లు, ఉప్పు లేదా బేకింగ్ సోడాతో మాత్రమే రుద్ది కడగాలి. 

కుండలోని నీటిని రెండు మూడు రోజులకు మించి అలాగే ఉంచకూడదు. ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉంటే, అందులో బ్యాక్టీరియా, నాచు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది.

అలాగే వేసవిలో దోమలు ఆ నీటిలో గుడ్లు పెట్టే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి, రోజుకోసారి లేదా కనీసం రెండు రోజులకొకసారి పాత నీటిని పారబోసి, కుండను శుభ్రంగా కడిగి మళ్లీ కొత్త నీటిని నింపుకోవాలి.

మట్టికుండ నీరు అమృతంతో సమానమే, కానీ దాన్ని సరైన పద్ధతిలో నిర్వహించినప్పుడే ఆ పూర్తి ఆరోగ్యం మనకు లభిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తూ, చల్లని, సురక్షితమైన మట్టికుండ నీటిని ఆస్వాదించండి.