AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లలో హోలీకి ప్రత్యేక రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు!

SCR Holi Special Trains 2026: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికులకు దక్షిణ మద్య రైల్వే గుడ్‌ న్యూస్ చెప్పింది. పండగ రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నటపనున్నట్టు పేర్కొంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక ట్రైన్లలో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లలో హోలీకి ప్రత్యేక రైళ్లు.. ఇదిగో పూర్తి వివరాలు!
Scr Holi Special Trains 2026
Anand T
|

Updated on: Feb 20, 2026 | 8:18 PM

Share

మార్చిలో హోలీ పండుగ నేపథ్యంలో రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి ఈ క్రింత పేర్కొన్న ప్రాంతాల మధ్య మధ్య ప్రత్యేక రైళ్లను నడపడనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ సర్వీసులు ఫిబ్రవరి 23 నుంచి మార్చి చివరి నాటికి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

రైల్వే శాఖ ప్రకారం.. చర్లపల్లి – దానాపూర్- చర్లపల్లి మధ్య 07091, 07092, 07093, 07094, 07095, 07096 నెంబర్ గల ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హర్షా, చందా ఫోర్ట్, గోండియా, బాలాఘాట్, నైన్‌పూర్, జబల్‌పూర్, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకీ, పండిట్‌లలో ఆగుతాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ , బక్సర్, అరా స్టేషన్‌ మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

ఇక చర్లపల్లి-బ్రహ్మాపూర్-చర్లపల్లి మధ్య రైలు నెం. 07027, 07028 రెండు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రయాణికులు మొత్తం 18 సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపాడు, ఇప్పేడు, శ్రీకాకుళం, సొప్పడపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. .

ఇవి కూడా చదవండి

ఇక యశ్వంత్‌పూర్ – హెచ్. నిజాముద్దీన్ – కాచిగూడ వయా యశ్వంత్‌పూర్ మధ్య 06569, 06570 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు యలహంక, ధర్మవరం, అనంతపురం, ధోన్, కర్నూలు నగరం, కాచిగూడ, కాజీపేట, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, బినా, విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర జంక్షన్ స్టేషన్ల మీదుగా రకపోకలు సాగిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

ప్రత్యేక రైళ్ల పూర్తి వివరాలు, టైమింగ్స్ ఇక్కడ చూడండి.

Special Trains

Special Trains

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్