Gold Price: మళ్లీ బంగారానికి రెక్కలు.. భారీగా పెరిగిన ధర.. వెండి సంగతేంటి?
Gold and Silver Prices: మళ్లీ బంగారానికి రెక్కలొచ్చాయి. ఇరాన్ - అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. సురక్షిత స్వర్గధామాలకు డిమాండ్ పెరగడంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భౌగోళిక రాజకీయ..

Gold and Silver Price Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. భారీగా పరుగులు పెట్టిన బంగారానికి కాస్త బ్రేకులు పడి తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడు పరుగులు పెడుతోంది. శుక్రవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 880 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 800 రూపాయలు ఎగబాకింది. బంగారం ధర పెరిగిన తర్వాత 24 క్యారెట్ల ధర రూ.1,57,370 ఉండగా, అదే 22 క్యారెట్ల తులం ధర రూ.1,44,250 వద్ద కొనసాగుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,030 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే నిలకడగా ఉంది. ధరల్లో తేడా లేదు. కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. అయితే గత మూడు రోజుల కిందట మాత్రం కిలో వెండి రూ.2.60,000 వద్ద ఉండేది. ఈ సమయంలో మళ్లీ పెరిగింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,370 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,44,250 వద్ద కొనసాగుతోంది.
Auto News: కార్ల వెనుక 1.2, 2.4 నంబర్లు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియని సీక్రెట్ ఇదే!
ఇరాన్ – అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు బులియన్ మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. సురక్షిత స్వర్గధామాలకు డిమాండ్ పెరగడంతో బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడల్లా, పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి డబ్బును ఉపసంహరించుకుని బంగారం, వెండి వంటి సురక్షిత స్వర్గధామాలలో పెట్టుబడి పెడతారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. మార్కెట్ భవిష్యత్తు దిశ ఎక్కువగా ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, ప్రపంచ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.
Indian Railways: కీలక అప్‌డేట్.. మార్చి 1 నుండి ఈ విధంగా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోలేరు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
