AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. సుంకాలు విధించే హక్కులేదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయనకు ఆ హక్కు లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం వసూలు చేసిన అదనపు పన్నులను అయా దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్.. సుంకాలు విధించే హక్కులేదు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
Donald Trump
Balaraju Goud
|

Updated on: Feb 20, 2026 | 9:06 PM

Share

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను విధించడాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయనకు ఆ హక్కు లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ ప్రభుత్వం వసూలు చేసిన అదనపు పన్నులను అయా దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి రూపొందించిన సమాఖ్య చట్టం ప్రకారం అమలు చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రపంచ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 20, 2026) తీర్పునిచ్చింది. విస్తృత వాణిజ్య చర్యలను సమర్థించడానికి అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని కోర్టు తప్పుబట్టింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికా సుప్రీంకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ఇతర దేశాలపై విధించిన సుంకాలను చట్టవిరుద్ధమని ప్రకటించింది.సుంకాల విధింపు చట్టవిరుద్ధమని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ట్రంప్ చాలా దేశాలపై సుంకాలను విధించడం ద్వారా తన అధికార పరిధిని అధిగమించారని కోర్టు పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి రూపొందించిన చట్టాలను దుర్వినియోగం చేస్తూ.. ట్రంప్ సుంకాలను విధించారని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే ఇప్పటివరకు ట్రంప్ ప్రభుత్వం వసూలు చేసిన అదనపు పన్నులను అయా దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం, పన్నులు, సుంకాలను విధించే అధికారం అధ్యక్షుడికి కాదు, కాంగ్రెస్ (పార్లమెంట్) వద్ద ఉంటుంది. అయితే, ట్రంప్ సుంకాలను కీలకమైన ఆర్థిక, విదేశాంగ విధాన సాధనంగా ఉపయోగించారు. రిపబ్లికన్ నాయకుడు ఈ సుంకాలను అమెరికా ఆర్థిక భద్రతకు చాలా ముఖ్యమైనవిగా అభివర్ణించారు. అవి లేకుండా దేశం నాశనం అవుతుందని అంచనా వేశారు. దీనిపై విచారణ చేపట్టిన అమెరికా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us