AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా ప్రయాణికులు.. లగేజీ చెక్‌ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్‌

. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల నుంచి భారీగా బంగారాన్ని పట్టుకుంది కస్టమ్స్‌ టీమ్‌. సుమారు 8 కిలోల గోల్డ్‌ను సీజ్‌ చేశారు. పట్టుబడిన బంగారం విలువ నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు.

Hyderabad: ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా ప్రయాణికులు.. లగేజీ చెక్‌ చేసిన అధికారులకు దిమ్మతిరిగే షాక్‌
Gold Smugglimg
Basha Shek
|

Updated on: Oct 08, 2022 | 7:40 AM

Share

ఎయిర్‌పోర్టులు గోల్డ్‌ స్మగ్లింగ్‌కు అడ్డాలుగా మారుతున్నాయ్‌. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్‌. అయితే, కస్టమ్స్‌ అధికారుల ముందు గోల్డ్ స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు. మీరు ఏ రూట్లో వచ్చినా.. మేం పట్టుకుంటామ్‌ అంటూ మళ్లీ నిరూపించారు మన అధికారులు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల నుంచి భారీగా బంగారాన్ని పట్టుకుంది కస్టమ్స్‌ టీమ్‌. సుమారు 8 కిలోల గోల్డ్‌ను సీజ్‌ చేశారు. పట్టుబడిన బంగారం విలువ నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. EK-524 నెంబర్‌ ఫ్లైట్‌లో దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్యాసింజర్స్‌ నుంచి 24 గోల్డ్‌ బిస్కట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కిలోల 8వందల గ్రాముల బరువైన ఈ గోల్డ్‌ విలువ కోటీ 47లక్షలకు పైగా ఉంటుందన్నారు కస్టమ్స్‌ అఫిషీయల్స్‌.

ఇక, EK-528 నెంబర్‌ గల మరో ఫ్టైట్‌ వచ్చిన ప్రయాణికుల నుంచి 4కిలోల 495 గ్రాముల బంగారాన్ని సీజ్‌ చేశారు. ఈ గోల్డ్‌ విలువ 2కోట్ల 57లక్షలకు పైగా ఉంటుందని తెలిపారు అధికారులు. ఈ రెండు కేసుల్లో సుమారు 8 కేజీల గోల్డ్‌ పట్టుబడగా, దాని విలువ దాదాపు నాలుగు కోట్ల రూపాయలుగా తేలింది. దుబాయ్‌ నుంచి పెద్దఎత్తున గోల్డ్‌ స్మగ్లింగ్‌ జరుగుతుండటంతో, అక్కడ్నుంచి వస్తోన్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు అధికారులు. అయితే, ఈమధ్య కాలంలో ఇంత పెద్దమొత్తంలో బంగారం పట్టుబడటం ఇదేనని చెబుతోంది కస్టమ్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కరోనా చికత్సకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
కరోనా చికత్సకు హెల్త్ ఇన్యూరెన్స్ వర్తిస్తుందా..?
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
NEET 2026 ఫలితాల్లో హనుమకొండ విద్యార్థికి 13వ ర్యాంకు.. లింక్ ఇదే
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
30 అడుగుల బావిలో పడిన మహిళ.. ఎలా బయటకు వచ్చిందంటే..
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ముదురుతున్న వివాదం
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
ముక్క ముట్టలేం.. గుడ్డు తినలేం.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
సచ్చుబడ్డ ఎముకలు కూడా బలంగా అవ్వాలంటే గుప్పెడు తింటే చాలు
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అనిరుద్ధ వినాయక చతుర్థి: రవి యోగంలో గణేశ పూజకు శుభ సమయం..
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
అల్పపీడనం ఎఫెక్ట్‌.. తెలుగురాష్ట్రాల్లోని ఈ జిల్లాల్లో వర్షాలు
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
మీడియాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా జూలై 18 న ప్రెస్ మీట్ లో క్లారిటీ
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..
ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే సిమ్ ఎప్పటికీ యాక్టివ్‌లోనే..