AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాతబస్తీలో గంజాయి బ్యాచ్ హల్ చల్.. మత్తులో అర్ధరాత్రి యువకుడు వీరంగం .. పలువురిపై దాడి

ఓల్డ్ సిటీ కలపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. రోడ్డుపై నిలిచి ఉన్న వాహనాలపై దాడులు చేసాడు. అటుగా వెళ్తున్న స్థానికులపై విచక్షణ రహితంగా దాడులకు దిగి వారిని గాయపరిచాడు

Hyderabad: పాతబస్తీలో గంజాయి బ్యాచ్ హల్ చల్.. మత్తులో అర్ధరాత్రి యువకుడు వీరంగం .. పలువురిపై దాడి
Hyderabad Old City
Surya Kala
|

Updated on: Oct 08, 2022 | 6:29 AM

Share

హైదరాబాద్ పాతబస్తీలో గంజాయి బ్యాచ్ పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. ఏ క్షణం ఎవరి పై దాడులు చేస్తారో పోలీసులు కూడా పసికట్టిలేని పరిస్థితి నెలకొంది. మత్తుకు బానిసగా మారిన యువత రోడ్డుపై దాడులు దిగి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రతి రోజు పాతబస్తీలో గంజా, వైట్నర్ల బాచ్ ఆగడాలు శృతి మించుతున్నాయి. నగరంలో గంజాయి బ్యాచ్  హల్ చల్ చేస్తోంది. ఓల్డసిటీ లో కొందరు యువకులు గంజాయి మత్తులో రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తూ స్థానికులపై దాడులకు దిగుతున్నారు. మద్యం మత్తులో యువకులు సృష్టిస్తున్న అలజడితో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఓల్డ్ సిటీ కలపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. రోడ్డుపై నిలిచి ఉన్న వాహనాలపై దాడులు చేసాడు. అటుగా వెళ్తున్న స్థానికులపై విచక్షణ రహితంగా దాడులకు దిగి వారిని గాయపరిచాడు. అర్ధరాత్రి కలపత్తర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనలో స్థానికులు గాయపడ్డారు.

మరోవైపు చాధార్ ఘాట్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ పాత నేరస్తుడు గంజాయి మత్తులో హల్చల్ చేసాడు. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూసెన్సు చేస్తున్న పాత నేరస్థుడు షారుక్ ను టాస్క్ ఫోర్స్, చాధార్ ఘాట్ పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా కత్తితోషారుక్ తనకు తానే గాయాలు చేసుకుని..  పోలీసులపై తనదైన స్టైల్ లో బెదిరింపులకు దిగాడు.

ఇవి కూడా చదవండి

స్థానిక పోలీసులు మత్తు పదార్ధాలు అమ్ముతున్న వారిపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మద్యం తీసుకుంటున్న యువతని .. మద్యం అమ్ముతున్నవారికి కేవలం కౌన్సిలింగ్ నిర్వహించి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Reporter : Anil, Tv9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..