Snake: ఇటుకల గోడను చాకచక్యంగా ఎక్కేసిన పాము.. నోకియా స్నేక్ గేమ్‌ను తలపిస్తోన్న వీడియో
ఒక పాము తెలివిగా ఇటుకల గోడను ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో గోడను తెలివిగా ఎక్కిన పామును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
సాధారణంగా పాములు నేలపై పాకుతాయి. అలాగే చెట్లను కూడా చుట్టుకుంటూ పైకి వెళుతుంటాయి. కానీ నునుపుగా ఉండే గోడల పైకి ఎక్కలేవు. ఒకవేళ ఎక్కేందుకు ప్రయత్నించినా కూడా కొద్ది దూరం మాత్రమే వెళ్లగలుగుతాయి. ఆ తర్వాత కిందకు పడిపోతాయి. కానీ ఒక పాము తెలివిగా ఇటుకల గోడను ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో గోడను తెలివిగా ఎక్కిన పామును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో ఈ వీడియోను చూస్తుంటే పాత తరం నోకియా ఫోన్లలో ఉన్న స్నేక్ గేమ్ గుర్తొస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పాము గోడ ఎక్కుతున్న ఈ వీడియోను కరోనాడో నేషనల్ మెమోరియల్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఇందులో ఉన్న పాము పేరు సోనోరన్ మౌంటెయిన్ కింగ్ స్నేక్‌గా తెలిపారు.
నోకియా స్నేక్ గేమ్‌ను గుర్తు చేసేలా..
అరిజోనాలోని కోరోనాడో నేషనల్ మెమోరియల్ పార్కులో.. సోనోరన్ మౌంటెయిన్ కింగ్ స్నేక్ గోడపైకి ఎక్కింది. ఎలా అంటే.. ఇటుకల మధ్య ఉన్న స్థలాన్ని ఆధారంగా చేసుకుని తెలివిగా ఆ పాము అలా పైకి ఎక్కేసింది. ఈ దృశ్యాన్ని పార్కు సిబ్బంది కెమెరాల్లో చిత్రీకరించి, ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇప్పటికే లక్షలాది వ్యూస్ రాగా.. వేలాది మంది లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఇది నాకు నోకియా స్నేక్ గేమ్‌ను గుర్తు చేసింది. ఈ పాము చాలా తెలివైనది’ అంటూ తమ పాత చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
సోనోరన్ మౌంటెయిన్ కింగ్ తరహా పాముల శరీరాలపై ఎరుపు, నలుపు, తెలుపు క్రాస్‌బ్యాండ్‌లు ఉంటాయి. కింగ్‌స్నేక్ వెబ్‌సైట్ ప్రకారం, అరిజోనాలోని మధ్య, ఆగ్నేయ పర్వత ప్రాంతాలలో ఇలాంటి సోనోరన్ పర్వత కింగ్‌స్నేక్‌లు ఎక్కువగా కనిపిస్తాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..