Parrot – Dog: నిద్రలేపడానికి రామ చిలుక తిప్పలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే.!
అందమైన పక్షులంటే అందరికీ ఇష్టమే.. అయితే వాటిలో భిన్నం రామ చిలుకలు. వీటిని పెంచుకోవడానికి ప్రజలు అమితాసక్తిని చూపిస్తారు. చిలుకలు ఎంత తెలివిగలవో అంతే అందంగా ఉంటాయి.
అందమైన పక్షులంటే అందరికీ ఇష్టమే.. అయితే వాటిలో భిన్నం రామ చిలుకలు. వీటిని పెంచుకోవడానికి ప్రజలు అమితాసక్తిని చూపిస్తారు. చిలుకలు ఎంత తెలివిగలవో అంతే అందంగా ఉంటాయి. మనుషుల స్వరాన్ని ఖచ్చితంగా అనుకరిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే రామ చిలుకలు మనుషుల స్వరాలను మాత్రమే కాదు.. వివిధ రకాల జంతువులను స్వరాలను, అనేక రకాల శబ్దాలను కూడా అనుకరిస్తాయి. అంతేకాదు చాలా చిలుకలు మొబైల్ ఫోన్ రింగ్‌టోన్‌ల ధ్వనిని కూడా అనుకరిస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ చిలుకకు సంబంధించి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో చిలుక కుక్క గొంతును అనుకరించిన తీరు నెటిజన్లను కట్టి పడేస్తోంది. కుక్కలాగా చిలుక మొరిగే శబ్దం వింటే మీరు కూడా అసలు నమ్మలేరు. చిలుక సరిగ్గా కుక్క గొంతుని కాపీ చేసింది. ఈ వీడియోలో ఒక కుక్క తన మంచం మీద హాయిగా నిద్రిస్తుండగా, తెల్లటి చిలుక.. ఆ కుక్క స్వరాన్ని అనుసరిస్తూ.. ఆ కుక్కను నిద్ర లేపడానికి ప్రయత్నిస్తుంది. మొదట్లో రామ చిలుక తన గొంతులో శునకాన్ని నిద్ర లేపాలని ప్రయత్నించినా నిద్ర లేవలేదు. దీంతో రామ చిలుక కుక్కలా మొరుగుతూ లేపడం మొదలు పెట్టింది. ఈ వీడియో చాలా ఫన్నీగా, అద్భుతంగా ఉండటంతో.. దీన్ని చూసిన కొందరు చిలుకకు బుద్ది చెప్పగా, మరికొందరు నవ్వుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Nayanthara properties: నయనతారకు అన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా ? ఏకంగా హైదరాబాద్‍లోనే..
Pizza: మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. అమ్మబాబోయ్.. దీన్ని పిజ్జా అంటారా.. వీడియో చూస్తే..
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

