AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పిల్లలు కనేందుకు ప్రయత్నిస్తే భార్యకు తీవ్ర అనారోగ్యం.. డాక్టర్‌ చెప్పింది విని నిర్ఘాంతపోయిన దంపతులు

శారీరకంగా కలిసిన ప్రతిసారీ భార్యకు శరీరమంతా దద్దుర్లు, దురదలు, తీవ్ర జ్వరం, దగ్గు వస్తున్నాయి. ఇలా కొన్నిరోజులుగా జరుగుతుంది. దీంతో వైద్య పరీక్షల కోసం ఆ దంపతులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ జంటకు కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు.

Hyderabad: పిల్లలు కనేందుకు ప్రయత్నిస్తే భార్యకు తీవ్ర అనారోగ్యం.. డాక్టర్‌ చెప్పింది విని నిర్ఘాంతపోయిన దంపతులు
Couple
Basha Shek
|

Updated on: Oct 08, 2022 | 8:51 AM

Share

హైదరాబాద్‌లో నివాసముంంటోన్న ఆ జంటకు పెళ్లయి సుమారు ఆరేళ్లు గడిచాయి. అయితే అమ్మానాన్నలు మాత్రం కాలేకపోయారు. ఎన్ని రకాల మందులు తీసుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతాన భాగ్యం కలగలేదు. దీనికితోడు శారీరకంగా కలిసిన ప్రతిసారీ భార్యకు శరీరమంతా దద్దుర్లు, దురదలు, తీవ్ర జ్వరం, దగ్గు వస్తున్నాయి. ఇలా కొన్నిరోజులుగా జరుగుతుంది. దీంతో వైద్య పరీక్షల కోసం ఆ దంపతులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ జంటకు కొన్ని పరీక్షలు చేసిన డాక్టర్లు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. టెస్టుల్లో భార్యకు సీమెన్ హైపర్‌సెన్సిటివిటీ రియాక్షన్ ఉన్నట్లు తేలిందని వైద్యులు తెలిపారు. భర్త వీర్యం ఆమెకు అసలు పడడం లేదని అందువల్లే ఎలెర్జీ వస్తుందని చెప్పడంతో ఆ దంపతులు నిర్ఘాంతపోయారు. ఇది అరుదైన కేసని, అయితే ప్రపంచంలో చాలా చోట్ల ఇలాంటి కేసులు వెలుగు చూశాయని వైద్యులు తెలిపారు. హైదరాబాద్‌లో మాత్రం మొదటి కేసన్నారు.

కాగా వైద్య పరీక్షల్లో భాగంగా సదరు మహిళ చేతిని స్టెరిలైజ్ చేసి, నొప్పి తెలియకుండా చేసే స్కిన్‌ టెస్టుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత భర్త నుంచి సేకరించిన 0.5 మిల్లీలీటర్ల వీర్యాన్ని ఆమె చర్మంపై ఉంచగా ఎలర్జిక్ రియాక్షన్ కనిపించింది. దీంతో ఆమెకు సీమెన్ ఎలర్జీ లేదా హైపర్‌సెన్సిటివిటీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే సమస్య మరింత తీవ్రమవుతుందని దంపతులను హెచ్చరించారు. ఒక్కోసారి ప్రాణాంతకమైన ఎలర్జిక్ అనాఫైలాక్టిక్ షాక్‌కు దారి తీయవచ్చని వారికి ముందస్తు జాగ్రత్తలు చెప్పారు. కాగా కలయిక సమయంలో కండోమ్ వాడితే ఈ సమస్య ఉండకపోవచ్చునని, అలాగే ఇన్‌ఫెర్టిలిటీ నిపుణుల సాయంతో పిల్లలను కనేందుకు ప్రయత్నించవచ్చని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..