Fake Currency: కట్టల కొద్దీ నకిలీ నోట్లు.. గుట్టుగా సాగుతున్న దందాకు చెక్‌ పెట్టిన పోలీసులు..

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఏకంగా కట్టల కొద్దీ నకిలీ నోట్లు పట్టుబడడం సంచలనం రేపుతోంది.

Fake Currency: కట్టల కొద్దీ నకిలీ నోట్లు.. గుట్టుగా సాగుతున్న దందాకు చెక్‌ పెట్టిన పోలీసులు..
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 08, 2022 | 10:12 PM

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో నకిలీ నోట్లు కలకలం రేపాయి. ఏకంగా కట్టల కొద్దీ నకిలీ నోట్లు పట్టుబడడం సంచలనం రేపుతోంది. ఓ ఇంట్లో గుట్టుగా నడుపుతున్న దందాకు చెక్‌ పెట్టారు పోలీసులు. పెద్ద మొత్తంలో ఫేక్‌ కరెన్సీని సీజ్‌ చేశారు. నాలుగు మొబైల్‌ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

బండిళ్లలో పొందుపర్చి ఫేక్‌ కరెన్సీని గుట్టుగా దాచారు నిందితులు. కొన్నాళ్లుగా ఎవరికీ అనుమానం రాకుండా ఫేక్‌ దందా కొనసాగిస్తున్నారు. అసలు నోట్లతో కలిపి జనాలకు ఫేక్‌ కరెన్సీని అంటగడుతున్నారు. అసలుదేదో.. నకిలీ నోటేదో తెలియని సామాన్యులు నిలువునా మోసపోతున్నారు. ఫేక్‌ దందాపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఫేక్‌ కరెన్సీ తయారు చేస్తోన్న నివాసంలో సోదాలు చేపట్టారు. నిందితుల్ని పట్టుకొని కటకటాలకు పంపారు. లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దందాలో ఎవరెవరి ప్రమేయం ఉంది..? వీరికి సహకరిస్తున్నదెవరు అన్నదానిపై ఆరాతీస్తున్నారు.

ఇటీవల.. దేశంలో నకిలీ నోట్లు పెరిగిపోయాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది రిజర్వ్‌ బ్యాంక్‌. 2021-22 వార్షిక నివేదికలో గత ఏడాదితో పోలిస్తే నకిలీ 500 నోట్లలో 101.9 శాతం, 2,000 నోట్లలో 54.16 శాతం పెరుగుదలను గుర్తించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ పరిణామం ఆందోళన కలిగించేదేనంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో