AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మంత్రి హరీష్ రావు పర్యటన.. సరదాగా పాత ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిన అమ్మలక్కలు..

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో కలియతిరిగారు. మిరుదొడ్డి నుంచి చేగుంట

Telangana: మంత్రి హరీష్ రావు పర్యటన.. సరదాగా పాత ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిన అమ్మలక్కలు..
Minister Harish Rao
Shiva Prajapati
|

Updated on: Oct 07, 2022 | 9:57 PM

Share

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో కలియతిరిగారు. మిరుదొడ్డి నుంచి చేగుంట వెళ్లే మార్గంలో ఖాజీపూర్‌లో పర్యటించిన హరీష్ రావు.. అక్కడి మహిళలతో కాసేపు ముచ్చించారు. ఇంటి అరుగులపై కూర్చొని బీడీలు చుడుతున్న మహిళల వద్దకు వెళ్లిన హరీష్ రావు వారితో మాట కలిపారు. సరదాగా కాసేపు మాట్లాడిన ఆయన.. ఆ మహిళలను ‘అమ్మ మీరు ఇన్ని సంవత్సరాల నుండి బీడీలు చుడుతూనే ఉన్నారు కానీ ఏ ప్రభుత్వమైనా మీకు, బీడీ కార్మికులకు పింఛను ఇచ్చిందా?’ అంటూ అడిగారు. ఇలా కాసేపు వారితో ముచ్చటించి బీడీలు చుడుతున్న అక్క, చెల్లెమ్మల ఆర్థిక స్థితిగతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇక మంత్రి హరీష్ రావు రాకతో సంబరపడిపోయిన మహిళలు.. సంతోషంగా మాట్లాడారు. సరదాగా, సంతోషంగా పాత ముచ్చట్లను నెమరు వేసుకున్నారు.

హరీష్ ఇలాకాలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్..

మంత్రి హరీష్‌రావు ఇలాకాలో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయ్‌. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్‌-భూంపల్లి మండలంలో కొట్లాటకు దిగారు రెండు పార్టీల కార్యకర్తలు. మంత్రి హరీష్‌రావు ముందే ఈ రగడ జరిగింది. డీసీసీబీ బ్యాంక్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ ఈ వివాదానికి కారణమైంది. డీసీసీబీ బ్యాంక్‌ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అటెండ్‌ అయ్యారు. అయితే, బ్యాంకు దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఫొటో లేకపోవడంతో బీజేపీ కేడర్‌ అభ్యంతరం తెలిపింది. ఎందుకు, రఘునందన్‌ ఫొటో వేయలేదంటూ గొడవకు దిగడంతో కాషాయ పార్టీ కార్యకర్తలు.

ప్రోటోకాల్‌ పాటించరా అంటూ అధికారులను నిలదీశారు. అది కాస్తా, టీఆర్‌ఎస్‌, బీజేపీ గొడవలా మారింది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ముందే తోపులాటకు దిగారు టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు. దాంతో, డీసీసీబీ ప్రారంభోత్సవం కాస్తా రచ్చరచ్చ అయ్యింది. అక్కడున్న నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదు టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు. రెండు వర్గాలూ తోపులాటకు దిగడంతో గందరగోళం ఏర్పడింది. చివరికి, పోలీసులు కల్పించుకున్నా తగ్గేదేలే అంటూ రెచ్చిపోయారు కార్యకర్తలు. దాంతో, ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..