AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తిరుపతిలో ప్రేమ వివాదం.. వరుడి ఇంటిపై దాడి చేసి వధువును ఎత్తుకెళ్లిన బంధువులు..

అలా పెళ్లి జరిగింది.. ఇలా లొల్లితో రచ్చ జరిగింది. సినిమా స్టైల్లో గూండాగిరి చేసి నవ వధువును ఎత్తుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు

Andhra Pradesh: తిరుపతిలో ప్రేమ వివాదం.. వరుడి ఇంటిపై దాడి చేసి వధువును ఎత్తుకెళ్లిన బంధువులు..
Lover Marriage
Shiva Prajapati
|

Updated on: Oct 07, 2022 | 9:24 PM

Share

అలా పెళ్లి జరిగింది.. ఇలా లొల్లితో రచ్చ జరిగింది. సినిమా స్టైల్లో గూండాగిరి చేసి నవ వధువును ఎత్తుకెళ్లారు ఆమె కుటుంబ సభ్యులు. తిరుపతి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన మోహన్ కృష్ణ.. తిరుపతి స్విమ్స్‌లో ఫిజియోథెరపీ డాక్టర్. గుంటూరుకు చెందిన సుష్మా ఇక్కడే మెడికో. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అలా ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని భావించారు. పెద్దలను ఒప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ, ఆమె పేరెంట్స్‌ బంధువులు ఒప్పుకోలేదు. ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా ప్రయోజనం కన్పించలేదు. రెండున్నరేళ్ల ప్రేమ ఎట్టకేలకు మూడు ముళ్ల బంధంతో ఏకమైంది. నెలన్నర కిందట పెళ్లి చేసుకున్నారు. పెద్ద మనసుతో ఏదో ఒకరోజు తమను ఆదరిస్తున్నారుకున్నారు. కానీ పెళ్లయిన ఆదిలోనే అత్తమ్మ వార్నింగ్‌ నెక్ట్స్‌ లెవల్‌లో ఇచ్చింది.

మరి అత్తమ్మ ఆ లెవల్‌లో వార్నింగ్‌ ఇచ్చాక.. భయపడకుండా వుంటారు. ఆ భయంతోనే దంపతులిద్దరూ జాగ్రత్త పడ్డారు. కానీ బెదిరంపుల పర్వంతో పాటు.. మోహనకృష్ణపై కిడ్నాప్‌ కేసు పెట్టారు. ఖాకీలు కౌన్సెలింగ్‌ ఇచ్చినా వాళ్ల వార్నింగ్‌లకు మాత్రం కళ్లెంపడలేదు. పెళ్లి అయి నెలన్నర అయ్యింది. అయినా ఆగ్రహం చల్లారక పెళ్లి కొడుకు ఇంటిపై అటాక్ చేశారు అమ్మాయి బంధువులు. ఇంటిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. రెండు వెహికిల్స్‌లో దూసుకొచ్చిన గ్యాంగ్.. మోహన్ కృష్ణ ఇంట్లో బీభత్సం సృష్టించారు. బెడ్‌రూమ్‌ డోర్స్‌ పగుల కొట్టి.. ఇల్లంతా విధ్వంసం సృష్టించారు. 40మందితో కలిసి దాడిచేసిన యువతి ఫ్యామిలీ మెంబర్స్‌.. ఇంటిలో ఫర్నిచర్‌ అంతా ధ్వంసంచేసి నానా బీభత్సం చేశారు. ఐరన్‌ రాడ్స్‌తో డోర్స్‌, అద్దాలు బద్దలుకొట్టారు. మోహన కృష్ణ కుటుంబంపై దాడిచేసి సుష్మాను తీసుకెళ్లారు.

అయితే, వీరి బీభత్సం అనంతరం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమకు న్యాయం చేయాలని, రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు మోహన కృష్ణ కుటుంబ సభ్యులు. తిరుపతి ఎస్పీ వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. అటు గుంటూరు పోలీసులకు కూడా మ్యాటర్ చేరింది. సంచలనం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. మరి ఈ లవ్ మ్యారేజ్ ఎటువైపు వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..