BRS – Andhra Pradesh: ఏపీలోనూ బీఆర్ఎస్ విస్తరిస్తుందా? వివిధ పార్టీల నేతల రెస్పాండ్స్ ఇదీ..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన పార్టీల నేతలు స్పందిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రతిపక్ష టీడీపీకి..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రధాన పార్టీల నేతలు స్పందిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రతిపక్ష టీడీపీకి చెందిన నేతలు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఏపీలో విస్తరిస్తుందా? ఆ పార్టీకి మద్ధతు లభిస్తుందా? అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే.. తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన BRSపై పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి రియాక్షన్స్ వస్తూనే ఉన్నాయి. అన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకు ఎటువంటి నష్టం ఉండదని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని గతంలో పవన్ కల్యాణ్ చెప్పిన మాటలను కారుమూరి ప్రస్తావించారు.
బీఆర్ఎస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ నేతలు ఒకింత ఎక్కువగానే రియాక్టయ్యారు. తానే ప్రధానిని కాబోతున్నానని గతంలో కేఏ పాల్ చెప్పారని టీడీపీ నేత బొండా ఉమా సెటైర్లు వేశారు. ఎవరికి ఎంత బలముందో ప్రజలు నిర్ణయిస్తారని బొండా ఉమా అన్నారు. అటు తమ లక్ష్యం 2024 పార్లమెంట్ ఎన్నికలేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లోపు జాతీయ పార్టీ హోదా సాధించగలమనే కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరో వైపు తెలంగాణ NGO సంఘం ప్రతినిధులు భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. సంఘం ప్రతినిధులు కేటీఆర్‌తో భేటీ అయి కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఉద్యోగుల మద్దతు టీఆర్ఎస్‌కే ఉంటుందని సంఘం నేతలు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..