AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: విజయవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఇకపై సామాన్య భక్తులకు కూడా ఆ అవకాశం..

దుర్గమ్మ భక్తులు నిజంగా ఇది పండుగ లాంటి వార్త. వీఐపీలకు మాత్రమే పరిమితమైన అంతరాలయ దర్శన భాగ్యం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి రానుంది.

Vijayawada: విజయవాడ దుర్గమ్మ భక్తులకు శుభవార్త.. ఇకపై సామాన్య భక్తులకు కూడా ఆ అవకాశం..
Vijayawada Durgamma
Shiva Prajapati
|

Updated on: Oct 07, 2022 | 8:10 PM

Share

దుర్గమ్మ భక్తులు నిజంగా ఇది పండుగ లాంటి వార్త. వీఐపీలకు మాత్రమే పరిమితమైన అంతరాలయ దర్శన భాగ్యం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి రానుంది. అవును, ఇది మేం అంటున్నది కాదు.. ఏకంగా ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక నుంచి సామాన్య భక్తులకు కూడా అమ్మవారి అంతరాలయ దర్శనం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రోటోకాల్ ఉన్న వారికే అంతరాలయ దర్శన భాగ్యం ఉండేదని, ఇక నుంచి అందరికీ ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు దేవాదాయ శాఖ మంత్రి. శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రకటన చేశారు. ప్రోటోకాల్‌తో పని లేకుండా ఎవరైనా సరే టిక్కెట్లు తీసుకుని అంతరాలయ దర్శనం చేసుకోవచ్చునని తెలిపారు మంత్రి.

గతంలో ప్రోటోకాల్‌తో పాటు, అంతరాలయ దర్శనానికి రూ.300 టికెట్ ఉండేదన్నారు. ఇప్పటి నుంచి అంతరాలయ దర్శనం కోసం రూ. 500 టికెట్ ఉంటే సరిపోతుందని, ప్రోటోకాల్ అక్కర్లేదని తెలిపారు మంత్రి సత్యనారాయణ. రూ. 500 ల టికెట్‌తో అంతరాలయ దర్శనం, రెండు అమ్మవారి లడ్డూ ప్రసాదం, ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలాఉండగా, ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన దసరా మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సత్యనారాయణ.. దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేశాయని, జిల్లా కలెక్టరు, పోలీస్ కమీషనర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని ప్రశంసించారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'