AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu for plants: ఈ మొక్కను మీ ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు.. అయస్కాంతంలా ఆకర్షిస్తుందట..

మీరు పనిచేస్తున్న కార్యాలయంలో ఒత్తిడి లేకుండా ఉండటానికి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, మీరు ఈ మొక్కను మీ డెస్క్‌కు నైరుతి దిశలో ఉంచండి. ఇది ఖచ్చితంగా మీకు విజయాన్ని ఇస్తుంది. ఇంటి బాల్కనీ టెర్రస్‌లో ఉంచినట్లయితే, అది శ్రేయస్సుకు దారి తీస్తుంది.

Vastu for plants: ఈ మొక్కను మీ ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు.. అయస్కాంతంలా ఆకర్షిస్తుందట..
Crussulla Plant
Jyothi Gadda
|

Updated on: Oct 07, 2022 | 1:48 PM

Share

ప్రతి ఇంట్లోనూ వాస్తు తప్పనిసరి. వాస్తు లో గృహాన్ని నిర్మించుకున్నా, పరిసరాల వాస్తు కూడా సరిగా ఉంటేనే ఫలితం అనుకూలంగా ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఇంటిని నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు ఇంటి స్థలం తో పాటుగా, పరిసరాల వాస్తు కూడా గమనించాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఇంట్లో వాస్తు ప్రకారం మొక్కలు నాటడం విషయానికి వస్తే, మనం తరచుగా మనీ ప్లాంట్, తులసి, శమీ వంటి మొక్కలను సంపదకు మూలంగా పరిగణిస్తుంటాము. అయితే క్రాసులా మొక్క దాని ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా… ఇంట్లో సరైన దిశలో సరైన ప్రదేశంలో నాటిన క్రాసులా మొక్క సంపదను కురిపిస్తుంది. ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఈ మొక్కకు సంబంధించిన వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం .

ఇంత వరకు మనీ ప్లాంట్ సంపదకు చిహ్నంగా చాలా మందికి భావిస్తుంటారు. అలాంటిదే మరో మొక్క క్రాసుల. దీన్నే జడ్‌ ప్లాంట్‌ అని కూడా అంటారు. డబ్బు ప్రయోజనం కోసం ఈ క్రాసుల మొక్కను మీ ఇంటికి లేదా ఆఫీసుల్లో తూర్పు లేదా ఉత్తర దిశలో నాటాలి. ఈ మొక్క సహజ గాలి శుద్దీకరణగా పనిచేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. మీరు ఈ మొక్కను ఇల్లు లేదా కార్యాలయానికి సరైన దిశలో ఉంచినట్లయితే, అది వాస్తు దోషాలను తొలగించడమే కాకుండా, ఇంట్లో సంపదకు కారణం అవుతుంది. అయితే, ఇంటికి ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కను నాటకూడదు. మెయిన్‌ డోర్ శక్తి, కార్యాచరణ ప్రదేశంగా పరిగణిస్తారు. కాబట్టి క్రాసులా మొక్కలను మెయిన్ డోర్ కు దూరంగా ఉంచాలి. మీ ఇంటిలో శక్తి ప్రవాహానికి అంతరాయం లేని ప్రదేశాలలో క్రాసులా మొక్కను ఉంచండి. ఇకపోతే, బెడ్‌ రూమ్‌లలో ఈ క్రాసులా మొక్కను అస్సలు ఉంచరాదు. వంటగది దగ్గర కూడా ఈ మొక్కను ఉంచకూడదు.

అలాగే, మీరు పనిచేస్తున్న కార్యాలయంలో ఒత్తిడి లేకుండా ఉండటానికి, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం, మీరు ఈ మొక్కను మీ డెస్క్‌కు నైరుతి దిశలో ఉంచండి. ఇది ఖచ్చితంగా మీకు విజయాన్ని ఇస్తుంది. మీకు వ్యాపారం ఉన్నట్లయితే, ఆ స్థలంలో మీ క్యాష్ కౌంటర్ పైన ఈ మొక్కను నాటడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ క్రాసుల మొక్కను ముఖ్యంగా బహిరంగ ప్రదేశంలో నాటడం శుభప్రదం. క్రాసులా మొక్కను ఇంట్లో చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే, అది ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో మంచి సూర్యకాంతి తగిలే ప్రదేశంలో ఉంచండి. ఇంటి బాల్కనీ టెర్రస్‌లో ఉంచినట్లయితే, అది శ్రేయస్సుకు దారి తీస్తుంది. మొక్క ఆకులకు దుమ్ము పడకుండా చూసుకోవాలి..దాంతో సానుకూల శక్తిని తెస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..