Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కొత్త అల్లుడి కోసం 128 వెరైటీ వంట‌కాలు.. గోదారోళ్లను మించిపోయిన విశాఖోళ్ల మర్యాద..

ఎప్పుడూ చూడని రకరకాల ఐటెమ్స్ చూసి ఫిదా అయ్యాడు అల్లుడు. అంతేకాకుండా అత్తమామల కుటుంబసభ్యులతో కలిసి సౌండ్ సిస్టం లో వస్తున్న మ్యూజిక్ తో స్టేప్పులేశాడు.. ఈ సందర్భంగా అత్తమామల ఇల్లంతా కోలాహలంగా మారింది .

Andhra Pradesh: కొత్త అల్లుడి కోసం 128 వెరైటీ వంట‌కాలు.. గోదారోళ్లను మించిపోయిన విశాఖోళ్ల మర్యాద..
Variety Dishes
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 07, 2022 | 1:17 PM

కొత్త అల్లుళ్లకి మర్యాదలు చేయటంలో గోదారోళ్లకి పెట్టింది పేరు.. ఇక దసరా వచ్చింది అంటే కొత్త అల్లుడికి చేసే మర్యాదలో ఆ లెక్కే వేరు.. అయితే ఇప్పుడు గోధారోల్లే కాదు మేము ఏ మాత్రం తీసిపోము అంతకు మించి అంటున్నారు విశాఖవాసులు.. విశాఖజిల్లాలో దసరా సందర్భంగా ఓ కొత్త అల్లుడికి వివిధ ప్రాంతాల నుండి ఆయా ప్రాంతాల్లో ఫేమస్ అయిన 128 వంటకాలతో అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చాడు మామ.. మామ ఇచ్చిన ట్రీట్ కి అల్లుడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

సంస్కృతి, సంప్రదాయాలతో తెలుగుదనం ఉట్టిపడే ప్రాంతం విశాఖపట్నం జిల్లా.. ఈ జిల్లావాసులు అతిథులకు ఇచ్చే గౌరవ మర్యాదలు వేరేలా ఉంటాయి.. ఇదే తరుణంలో తెలుగు సంప్రదాయం తో కొత్త అల్లుడికి ఘన స్వాగతం పలికారు ఒక అత్తమామల కుటుంబం..అందుకు విజయదశమి వేదికైంది..విశాఖ జిల్లా విజయదశమి అంటేనే కళకళలాడుతూ ఉంటుంది.. ఈ జిల్లాలో కుమార్తె కు వివాహ నిశ్చయం అయిన తరువాత తొలి దసరా పండుగకి అల్లుడు హోదాలో ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీ.. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా మాధవ ధార కి చెందిన కలగర్ల శ్రీనివాస్, ధనలక్ష్మి దంపతులు తమ కావాల్సిన అల్లుడిని పండుగకు ఆహ్వానించారు.. అంతే కాకుండా తమ అల్లుడు కనీవినీ ఎరుగని, ఎప్పుడు టేస్ట్ కూడా చేయని 128 రకాల వంటకాలను వివిధ ప్రాంతాల నుండి తీసుకు వచ్చారు.. అన్ని ఏర్పాట్లు పండుగ రోజుకి పూర్తిచేశారు.. తరువాత అత్తమామల ఆహ్వానం మేరకు తమ అల్లుడు కాపుగంటి చైతన్య మధవధార లోని అత్తమామల ఇంటికి చేరుకున్నాడు.. అయితే అక్కడ అత్తమామల ఏర్పాట్లు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

ఎప్పుడూ చూడని రకరకాల ఐటెమ్స్ చూసి ఫిదా అయ్యాడు అల్లుడు. అంతేకాకుండా అత్తమామల కుటుంబసభ్యులతో కలిసి సౌండ్ సిస్టం లో వస్తున్న మ్యూజిక్ తో స్టేప్పులేశాడు.. ఈ సందర్భంగా అత్తమామల ఇల్లంతా కోలాహలంగా మారింది .. ఈ సందర్భంగా కలగర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఏదైనా కొత్త గా .. కొత్త అల్లుడికి స్వాగతం పలకాలనే ఆలోచనతో ఈ విధంగా స్వాగత ఏర్పాట్లు చేశాం అని, ఈ విధoగా ఏర్పాటు చేయడం వలన సంతృప్తి కలిగిందని, ఇటువంటి కార్యక్రమం ద్వారా భావితారాలకు తెలుగుతనం గొప్పతనం తెలుస్తుంది అనే ప్రధాన ఉద్దేశ్యం తో కార్యక్రమం నిర్వహించాం అని అన్నారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..