Weather Report: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి.. మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం వర్షాలు భారీగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం..
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం వర్షాలు భారీగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజులు, తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక హైదరాబాద్‌లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంలో ఎల్లో అలర్ట్ చేసి చేసింది వాతావరణ శాఖ.
కోస్తాంధ్రపై అల్పపీడన ప్రభావం:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులుత ఎలిపారు. దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరంతో పాటు ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మధ్య భాగాలలో సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ 9 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురియనున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ. నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, భూవనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక ఏపీలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి