Munugode Bypoll: మునుగోడు సెంటర్‌గా మంత్రుల మకాం.. గెలుపే లక్ష్యంగా కేటీఆర్, హరీష్ రావు వ్యూహం..
నామినేషన్ల పక్రియ మొదలు కావడంతో పార్టీలు వ్యూహాలకు పదను పెడుతున్నాయి. ఇప్పటి వరకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే..అన్ని కోణాల్లో ఆలోచించిన కేసీఆర్.. గతంలో ఓ సారి ఎమ్మెల్యేగా పని చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌నే అభ్యర్థిగా ప్రకటించారు.
మునుగోడు నామినేషన్ల సందడి షురూ అయింది. నవంబర్ 3న జరిగే పోలింగ్‌కు మొదటి దశ పక్రియ మొదలయింది. ఈనెల 14న ఆఖరు తేదీ. దీంతో మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పార్టీలు, అభ్యర్థులు ఇవాళ్టి నుంచి నామినేషన్లు వేయనున్నారు. నామినేషన్ల పక్రియ మొదలు కావడంతో పార్టీలు వ్యూహాలకు పదను పెడుతున్నాయి. ఇప్పటి వరకు ఉప ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించాయి. అయితే..అన్ని కోణాల్లో ఆలోచించిన కేసీఆర్.. గతంలో ఓ సారి ఎమ్మెల్యేగా పని చేసిన కూసుకుంట్ల ప్రభాకర్‌నే అభ్యర్థిగా ప్రకటించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కసుకుంట్ల పేరు ప్రకటించడానికి ముందు పార్టీ పలు కోణాల్లో సర్వేలు చేయించింది. అన్నింటిలోనూ కూసకుంట్లకే మొగ్గు చూపడంతో మిగతా వాళ్ల పేర్లు సైడ్ అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైన గెలువాలన్న లక్ష్యంగా ముందుకెళ్తున్న కేసీఆర్.. బలమైన అభ్యర్థిని ఎంపిక చేశారు. త్వరలోనే నామినేషన్ తేదీని కూడా ఖరారు చేయనున్నారు.
నామినేషన్ల కోసం చందూరు తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల చేత నామినేషన్లు దాఖలు చేయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 10న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 14న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు మొదలయ్యే నామినేషన్ల దాఖలు.. మధ్యాహ్నం మూడు గంటల వరకు తీసుకుంటారు. మరోవైపు ఇటు నామినేషన్లు మొదలయ్యాయో లేదో.. అటు నగదు కూడా పట్టుబడుతోంది. మునుగోడు మండలం గండపురి చెక్‌పోస్టు దగ్గర 13లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చండూరు మండలం భీమనపల్లికి చెందిన నరసింహ ఈ డబ్బును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బు అని నరసింహ చెబుతున్నారు.
నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల రూల్స్ ప్రకారం విగ్రహాలకు ముసుగులు తొడుగుతున్నారు. వాల్‌పోస్టర్లు, ప్లెక్సీలను తొలగిస్తున్నారు. ఏడుమండలాల్లో ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోసం 6 టీమ్‌లు, సర్వే సాస్టిక్ టీమ్‌లు 6. ప్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు 7, వీడియో సర్వేలైన్స్ కోసం6 టీమ్‌లు పనిచేస్తున్నాయి. మరో వైపు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ప్రతి ఓటరును కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్థులను బీజేపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కూడా గ్రామ గ్రామాన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
టీఆర్‌ఎస్ కూడా మునుగోడు గెలుపు కోసం పార్టీ యంత్రాంగాన్ని మొత్తం మోహరించింది. మంత్రుల వారీగా మండలాలు, గ్రామాలకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులను కూడా మునుగోడులోనే మకాం వేయాలని కేసీఆర్ ఆదేశించారు. సామాజిక వర్గాల వారీగా గ్రామాలకు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. ప్రధాన పార్టీలతో పాటు చిన్న చిన్న పార్టీలు కూడా మునుగోడులో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. సీపీఐ, సీపీఎంలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు తమ మద్దతు తెలిపాయి. ఇక ప్రజాశాంతి పార్టీ సైతం మునుగోడులో అభ్యర్థిని దింపుతోంది. ప్రజా గాయకుడు గద్దర్‌ను పోటీకి ఒప్పించిన కేఏపాల్ బీ ఫామ్ కూడా ఇచ్చేశారు. మరి కొందరు కూడా స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల దాఖలుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భువనగిరి జిల్లా కలెక్టర్, మునుగోడు ఎన్నికల అధికారి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
తొలిరోజు రెండు నామినేషన్లు..
మునుగోడు ఉప ఎన్నికకు తొలిరోజు నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొదటిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజాఏక్త పార్టీ అభ్యర్ధి బండారు నాగరాజు, ఇండిపెండెంట్ అభ్యర్థి మారం వెంకట్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..