AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode By-poll: మునుగోడు అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్‌ఎస్‌ టికెట్‌

సస్పెన్స్‌ వీడింది. నోటిఫికేషన్‌ రోజే మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కింది.. కాసేపట్లో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు.

Munugode By-poll: మునుగోడు అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్‌ఎస్‌ టికెట్‌
Kusukuntla Prabhakar Reddy and CK KCR
Sanjay Kasula
|

Updated on: Oct 07, 2022 | 12:16 PM

Share

మునుగోడు అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించింది. సస్పెన్స్‌ వీడింది. నోటిఫికేషన్‌ రోజే మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కింది.. కాసేపట్లో ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే మునుగోడు నేతలతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో భేటీ అయ్యారు. ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరైనా సహకరించాలని నేతలకు కేటీఆర్‌ సూచించారు.

అటు పార్టీ పేరు మార్పుపై వేగంగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇటు మునుగోడు ఉప ఎన్నికలపైనా ఫోకస్‌ పెట్టారు. రేపటి నుంచి ఇంచార్జ్‌లంతా క్షేత్రస్థాయికి వెళ్లిపోవాలని ఆదేశించారాయన. మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఒక్కో ఇంచార్జ్‌ను నియమించారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావును సైతం మోహరించారు. కేటీఆర్‌కు గట్టుప్పల్‌-1 బాధ్యతలు అప్పగించగా.. మర్రిగూడ బాధ్యతలు హరీష్‌ చూస్తారు.

100 మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్‌ని పెట్టాలని.. యూనిట్‌ ఇంచార్జ్‌లకు నాయకత్వం సూచించింది. ఒక్కో యూనిట్‌లో దాదాపు మూడు వేల ఓట్లు ఉంటాయి. ఓటర్ల సామాజికవర్గాలను బట్టి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించారు. ఈలెక్కన 86 మంది ఎమ్మెల్యేలు, 14 మంది మంత్రులు రంగంలోకి దిగుతున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. నల్గొండ కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చండూరు మండల ఆఫీసులో నామినేషన్లు స్వీకరిస్తారు. రిటర్నింగ్‌ అధికారిగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ జగన్నాథరావును వ్యవహరిస్తున్నారు. నామినేషన్లపై సందేహాలు తీర్చేందుకు హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియను వీడియో షూట్‌ చేస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..