Pulasa Fish: ఈ సీజన్‌లో దొరికిన మొదటి పులస.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే అవాక్కవుతారు..

తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఫిష్ మార్కెట్‌లో మూడు కేజీల పులస చేప ఏకంగా 22వేల రూపాయలు పలికింది. ఈ సీజన్‌లో దొరికిన మొదటి పులస కావడంతో దాన్ని దక్కించుకోవడానికి ఎగబడ్డారు పులస ప్రియులు.

Pulasa Fish: ఈ సీజన్‌లో దొరికిన మొదటి పులస.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే అవాక్కవుతారు..
Pulasa Fish
Follow us
Basha Shek

|

Updated on: Oct 08, 2022 | 8:08 AM

పులస.. ఈ పేరు వింటేనే నాన్‌వెజ్‌ ప్రియులకు నోరూరిపోతుంది. గోదావరి జిల్లాల్లో అయితే పులస క్రేజే వేరు. ఆ మాటకొస్తే ఫిష్ మార్కెట్‌లో పులస ప్రయారిటీనే సెపరేటు. పులసది తిరుగులేని బ్రాండ్‌. పుస్తెలమ్మినాసరే పులస తినాలంటారు గోదారోళ్లు. అనడమే కాదు, ఎంత రేటైనా పెట్టి కొని తింటారు. వేలంలో పోటీపడిమరీ వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తారు. దీంతో, పులస ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా పులస రికార్డులు బద్దలుకొట్టింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఫిష్ మార్కెట్‌లో మూడు కేజీల పులస చేప ఏకంగా 22వేల రూపాయలు పలికింది. ఈ సీజన్‌లో దొరికిన మొదటి పులస కావడంతో దాన్ని దక్కించుకోవడానికి ఎగబడ్డారు పులస ప్రియులు.

చివరకు రాజోలుకు చెందిన బైడిశెట్టి శ్రీరాములు ఈ పులసను దక్కించుకున్నాడు. పులస టేస్టే వేరు. అందుకే, లైఫ్‌లో ఒక్కసారైనా దాని రుచి చూడాల్సిందే అంటారు. ముఖ్యంగా వర్షాలు పడిన తర్వాత దొరికే ఫస్ట్ పీస్ టేస్ట్‌ ఇంకా సూపర్. అందుకే దానికి మార్కెట్‌లో అంత డిమాండ్. అయితే, ఈ సీజన్‌లో దొరక్కదొరక్క దొరికిన పులస 22వేల రూపాయలు పలికింది. మరి, ఈ సీజన్‌లో ఇదే హయ్యస్ట్‌ ప్రైస్‌గా మిగిలిపోతుందా? లేక మరో పులస ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..